Saturday, August 30Thank you for visiting

Tag: Telugu news

భూకంప హెచ్చరికలను ఇక స్మార్ట్‌ఫోన్‌లలోనే చూడొచ్చు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్ 

భూకంప హెచ్చరికలను ఇక స్మార్ట్‌ఫోన్‌లలోనే చూడొచ్చు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్ 

Technology
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది..ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను ముందుగానే గుర్తించి  prajalaku భూకంప హెచ్చరికలను జారీ చేసే సేవలను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు గూగుల్.. బుధవారం తెలిపింది.నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి Google భారతదేశంలో ""Android Earthquake Alerts System" ని ప్రవేశపెట్టింది."ఈరోజు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి, మేము  భారతదేశంలో Android భూకంప హెచ్చరికల వ్యవస్థను తీసుకురాబోతున్నాం.  ఈ ప్రయోగం ద్వారా, మేము Android వినియోగదారులకు భూకంపాలు సంభవించే ముందు ఆటోమేటిక్ గా..  హెచ్చరికలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము." అని గూగుల్ ఒక బ్లాగ్‌లో పేర్కొంది. ...
Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Andhrapradesh
Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది.సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియో...
సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Local, Telangana
కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యంWarangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ...
వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

Crime
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించనందుకు ఓ దళిత మహిళను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి బలవంతంగా మూత్రం తాగించారు. సభ్య సమాజం చీదరించుకునే ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.9,000 రుణానికి రూ.1,500 వడ్డీ చెల్లించనందుకు దళిత మహిళపై దాడి చేసి, బట్టలు విప్పి, బలవంతంగా మూత్రం తాగించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధిత మహిళ తలపై గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. కేవలం రూ.1500 వడ్డీ చెల్లించకపోవడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడారని తెలిపారు. బాధిత మహిళ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్...
మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నాం.. మంత్రి కేటీఆర్

Telangana
Musi River Bridges : హైదరాబాద్ మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో సహా ప‌లువురు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తుచేశారు. గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికికూపంగా మారిం ది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయని.. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు. నిధులు పెరిగినా ప‌ర‌వాలేదు... హ...
మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య

మహిళపై సామూహిక అత్యాచారం.. అవమానభారంతో దంపతుల ఆత్మహత్య

Crime
Crime news : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ ముగ్గురు బిడ్డలను అనాథలు చేసి.. భార్యాభర్తలు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అంతకుముందు.. మహిళపై సామూహిక అత్యాచారం జరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది!ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రం బస్తి జిల్లా (Basti district) లోని ఓ గ్రామంలో.. 30ఏళ్ల వ్యక్తి.. తన 27ఏళ్ల భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుల వయస్సు 8 ఏళ్లు- ఆరేళ్లు, అలాగే ఏడాది వయస్సు ఉన్న కుమార్తె ఉంది. సెప్టెంబర్​ 20 అర్ధరాత్రి వీరి ఇంట్లోకి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దారుణ ఘటనను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ప్రాణాలను తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. మరుసటి రోజు పిల్లలు పాఠశాలకు రెడీ చేసి వీరిద్దరూ విషం తాగారు. గదిలో నుంచి బయటకు వచ్చి మేం చనిపోతున్నామని పిల్లలకు చెప్...
 Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..

 Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..

Technology
Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది 'ట్రూకాలర్‌' యాప్‌ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్‌ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది.గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్‌ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్‌ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) తో పనిచేసే సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. లేటెస్ట్‌ గా మార్చిన పేరుని తక్షణమే తెలుపుతుందని పేర్కొంది. ఈ యాప్ ఆయా నంబర్లను 3 రంగుల్లో వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పునకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత లేదా స్కామర్ కార...
Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్  వచ్చేసింది.

Motorola Edge 40 Neo: మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

Technology
Lenovo యాజమాన్యంలోని మోటొరోలా బ్రాండ్ నుంచి సరికొత్త 5G  స్మార్ట్‌ఫోన్‌ Motorola Edge 40 Neo 5G గురువారం భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఎడ్జ్-సిరీస్ కొత్త ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగు MediaTek Dimensity 7030 SoC ప్రాసెసర్ తో రన్ అవుతుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Motorola Edge 40 Neo ఇతర వాటితో పాటు Realme 10 Pro+ , iQoo Neo 6, Samsung Galaxy M53 5G వంటి వాటితో పోటీ పడుతుంది.. Motorola Edge 40 Neo ధర భారతదేశంలో Motorola Edge 40 Neo బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.23,999. 12 GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 25,999 గా ఉంది . ఫోన్ మూడు రంగులలో వస్తుంది, కాగా మోటోరోలా కంపెనీ ఇండి...
ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..

National
Adi Shankaracharya Statue :  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )' అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరుపెట్టారు. ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్ లో ఓ మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఇండోర్ ...
ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్

ఢిల్లీలో దారుణం.. వెల్లుల్లి వ్యాపారినికి కొట్టి బట్టలు విప్పి ఊరేగించిన కమీషన్ ఏజెంట్

Crime
న్యూఢిల్లీ: నోయిడా(Noida)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్ నుంచి అప్పుగా తీసుకున్న రూ.3వేలు చెల్లించకపోవడంతో వెల్లుల్లి వ్యాపారని కొట్టి, బలవంతంగా బట్టలు విప్పి ఊరేగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఏజెంట్‌తో సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం వెల్లుల్లి వ్యాపారి నెల క్రితం కమీషన్ ఏజెంట్ సుందర్ నుంచి రూ. 5,600 మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఆదియాస్ అని పిలిచే ఈ ఏజెంట్లు రైతులకు, కొనుగోలుదారులకు మధ్య మధ్యవర్తులుగా ఉంటారు. మార్కెట్లో క్రయవిక్రయాలపై వీరికి పట్టు ఉంటుంది. అయితే సోమవారం వ్యాపారి రూ.2,500 తిరిగి ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత సమయం అడిగాడు.దీంతో ఆగ్రహం చెందిన సుందర్.. ఇద్దరు కూలీలకు ఫోన్ చేశాడు. వారు వెల్లుల్లి విక్రేతను ఒక దుకాణంలోకి తీసుక...