తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం..
Osmania University | రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించింది. తెలంగాణ ప్రభుత్వం. వీసీల నియమాక ఉత్వర్వులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యనందరావు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డి నియమితులయ్యారు.తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అ...