విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..
Visakha Metro Rail | ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక అప్ డేట్.. వచ్చింది. మెట్రో లైన్ నిర్మాణానికి సంబంధించిన మొదటి దశ డీపీఆర్‌లను చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొదటి విడతో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది.మొదటి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ)
రెండో కారిడార్ : గురుద్వార్ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్ వరకు (5.08కి.మీ)
మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ)కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖర్చవుతుందని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ...