
SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివరాలు ఇవే..
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు యథావిథిగా నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు వివరించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.పొడిగించిన రైళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల మధ్య నడిచే సుదూర రైళ్లు ఉన్నాయి. కింది రైళ్లు డిసెంబర్ వరకు నడుస్తాయి.సికింద్రాబాద్-రామనాథపురం (07695),
రామనాథపురం-సికింద్రాబాద్ (07696),
కాచిగూడ – మధురై (07191),
మధురై – కా...







