Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: secunderabad

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..
Telangana

ఘట్‌కేసర్ – సనత్‌నగర్ మార్గంలో MMTS  సర్వీస్ లకు భారీగా డిమాండ్.. కొత్త స్టేషన్లు నిర్మించాలని వినతులు..

Ghatkesar-Sanathnagar MMTS | ఘట్‌కేసర్ - సనత్‌నగర్ కొత్త MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌) రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ సెక్షన్‌లో కొత్త MMTS స్టేషన్లు నిర్మించాలనే డిమాండ్లు  కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సాధారణ ప్రయాణికులు, విద్యార్థులు ఈ మార్గంలో  పెద్ద సంఖ్యలో ప్రతీరోజు ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సౌకర్యార్థం ఆనంద్‌బాగ్‌లో కొత్త స్టేషన్,  అల్వాల్‌లోని లయోలా కాలేజీ సమీపంలో స్టేషన్‌ను నిర్మించాలని MMTS రైలు స్టేషన్ సాధన సమితి,  సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  రైల్వే అధికారులను కోరారు.Ghatkesar-Sanathnagar MMTS : ఘట్‌కేసర్-సనత్‌నగర్ బై-పాస్ లైన్‌లో కొత్త స్టేషన్‌ల కోసం స్థలాలను గుర్తించేందుకు తాత్కాలిక సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని సబర్బన్ రైలు ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులను కోరారు.  “చెర్లపల...
IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర
Telangana

IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర

IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ రైలు యాత్రను ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్టు రైలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. తీర్థ యాత్రలు ఇవే..తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం-, తిరుచ్చి, తంజావూరుహాల్టింగ్ స్టేష‌న్లు.. ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికుల‌కు జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనం కోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ , అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, ...
Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..
Elections, Telangana

Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..

Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా  మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని, అదే రోజున లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్లు కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు..సికింద్రాబాద్‌, కొత్తగూడెం, కొత్తకోటలో ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగిస్తూ.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోరైలు, ఓఆర్‌ఆర్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఫ్లైఓవర్‌లతో పాటు ఐటీ, ఫార్మా రంగాలను విస్తరించి ‘గ్లోబల్‌ సిటీ’గా మార్చాయని అన్నా...
SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..
Telangana

SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

SCR Special Trains | తెలుగు రాష్ట్రాల‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెల‌వుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖ‌రులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవ‌కాశ‌ముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మ‌ర్ వెకేష‌న్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను న‌డిపించ‌నుంది. ఇందులో కొన్ని రైళ్లు సికింద్రాబాద్‌ నుంచి న‌డ‌వ‌నున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. పాట్నా-సికింద్రాబాద్‌ (03253) మధ్య మే 1 నుంచి జూలై 31 వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో నడుస్తుంది. హైదరాబాద్‌ – పాట్నా (07255) రైలు మే ...
Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు
Telangana

Cherlapally Railway Terminal | త్వరలో అందుబాటులోకి చర్లపల్లి టెర్మినల్‌.. ఇక్కడి నుంచే 25 రైళ్ల రాకపోకలు

Cherlapally Railway Terminal |  ప్రయాణికులకు శుభవార్త.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో  కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్‌సిటీ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం ఉంది. అయితే  రైల్వే టర్మినల్  అందుబాటులోకి వచ్చాక సుమారు 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందంచింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే కొన్ని ట్రైన్స్ ను చర్లపల్లి టెర్మినల్కు మార్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆరు లైన్లతో అత్యాధునిక స్టేషన్ అయితే లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత చర్పలల్లి టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ...
Summer Special Trains  సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు
Telangana

Summer Special Trains సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు

Secunderabad: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని  సికింద్రాబాద్‌ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపించనున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ (Shalimar)‌, సాంత్రాగాచి ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు. సికింద్రాబాద్‌-సాంత్రాగాచి రైలు సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది.  ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 29 వరకు మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు.  ప్రతీ శనివారం తిరుగు ప్రయాణమయ్యే  సాంత్రాగాచి-సికింద్రాబాద్‌ (07224) రైలు ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు.రైలు ఆగే స్టేషన్లు : సికింద్రాబాద్‌-సాంత్రాగాచి (07223) రైలు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల లో  ఆగుతుందన...
Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..
Telangana

Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Special Trains వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. అందరూ సమ్మర్ వేకేషన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ పెరగనుంది.  ప్రయాణికుల నుంచి వస్తున్నడిమాండ్ ను పరిగణలోకి తీసుకుని.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఈ మేరకు.. వివిధ ప్రాంతాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ నడుపనున్నట్టు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.దక్షిణ మధ్య రైల్వే (SCR) ప‌రిధిలో ప‌లు ప్రాంతాలను కలుపుతూ 48 ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ - నాగర్‌సోల్ (ట్రైన్ నంబర్. 07517) ఏప్రిల్ 17 , మే 29 మధ్య నడుస్తుంది, నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్. 07518) ఏప్రిల్ 18, మే 30 మధ్య నడుస్తుంది.అదేవిధంగా, ప్రత్యేక రైలు హైదరాబాద్ - కటక్ (ట్రైన్ నంబర్ 07165) మంగళవారం (ఏప్రిల్ 16, ఏప్రిల్ 23 , ఏప్రిల్ 30) నడుస్తుంది, కటక్-హైదరా...
Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..
National

Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది.సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14  రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.  జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ  క్యూాఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టినట్లు రైల్...
Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..
Andhrapradesh, Telangana

Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుం...
Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..
Telangana

Ghatkesar MMTS | ఘట్ కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు ఇవే..

Ghatkesar -Lingampalli Train Service : ఘట్ కేసర్ - లింగంపల్లి రైలు సర్వీస్, సంగారెడ్డిలో మంగళవారం రూ.7,200కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘట్ కేసర్  - లింగంపల్లి - మౌలాలి - సనత్ నగర్ మీదుగా ప్రారంభమైన ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్) రైలు సర్వీస్ నుకూడా మోదీ ప్రారంభించారు. ఈ రైలు సర్వీస్..  హైదరాబాద్ - సికింద్రాబాద్ వ్యాప్తంగా  ప్రసిద్ధ సబర్బన్ రైలు సేవలను అందించనుంది.ఘట్ కేసర్-లింగంపల్లి మార్గంలో తొలి రైలు  మంగళవారం ఉదయం 10.45 గంటలకు మొదటి  ప్రయాణం ప్రారంభించి మధ్యాహ్నం 12.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది. మౌలాలి-సనత్ నగర్-మీదుగా ఘట్ కేసర్ -లింగంపల్లి ఎంఎంటీఎస్ ఫీచర్లు..ఈ సర్వీస్ MMTS పరిధిని ప్రస్తుత 90 కి.మీ (44 స్టేషన్లు) నుండి 123.52 కి.మీ (53 స్టేషన్లు)కి పెంచుతుంది.  కొత్త విభాగం MMTSని తూర్పు వైపున ఉన్న సికింద్రాబా...