Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: revanth reddy

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ఎదుట రాష్ట్ర ర‌హ‌దారుల ప్రతిపాదనలు ఇవే.. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

Telangana
New National Highways | తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వ‌రుస‌గా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్ర‌తిపాద‌న‌ల‌ గురించి ఆయా శాఖ‌ల మంత్రుల‌తో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈమేర‌కు బుధ‌వారం కేంద్ర ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని క‌లిశారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ‌లో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జాతీయ‌, రాష్ట్ర ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను కేంద్ర మంత్రికి ముందుంచారు.రీజిన‌ల్ రింగు రోడ్డు ( RRR) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబాద్-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్ల ర‌హ‌దారిగా విస్త‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గ‌జ్వేల్‌-జ‌గ‌దేవ్‌పూర్‌-భువ‌న‌గిరి-చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జా...
Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Crop Loans | రూ.2 లక్షల రుణమాఫీకి ఎన్నో సవాళ్లు..

Telangana
Crop Loans | మెజారిటీ సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy, ) రైతులకు ₹ 2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేస్తానని హామీలు గుప్పించారు. దాదాపు ప్రతి ఎన్నికల ర్యాలీలో దేవుని పేరు మీద ఆయన ప్రమాణాలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి తన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన ముందున్న కఠినమైన వాస్తవం ఏమిటంటే, రైతులను అప్పుల కాడి నుండి విముక్తి చేయడానికి సీఎంకు ₹ 33,000 కోట్ల మేర నిధులు అవసరం ఉంది.కనీస మద్దతు ధర కంటే బోనస్‌గా క్వింటాల్ వరికి రూ.500 చెల్లించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాష్ట్రం ఇప్పటికే సబ్సిడీతో కూడిన ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఇది సామాజిక భ...
Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Old City Metro Project : త్వ‌ర‌లో ఓల్డ్ ‌సిటీలో మెట్రో ప‌రుగులు.. మార‌నున్న రూపురేఖ‌లు

Telangana
Old City Metro Project : హైదరాబాద్‌లోని ‌పాత బస్తీ మెట్రో రైలు (Pathabasthi Metro Rail) మార్గానికి శుక్రవారం ఫరూక్‌ ‌నగర్‌ ‌డిపో వ‌ద్ద‌ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌ చేశారు. ఎంజీబీఎస్‌ ‌నుంచి ఫలక్‌ ‌నుమా వరకు మొత్తం 5.5 కిలోటర్ల పొడవున 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని తెలంగాణ‌ ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ ‌సిటీ కాదు.. ఒరిజినల్‌ ‌హైదరాబాద్‌.. అని అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత త‌మ‌ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మెట్రో స్టేష‌న్లు ఎక్క‌డ‌? మెట్రో లైన్‌ ఎంజీబీఎస్‌, ‌దారుల్‌ ‌షిఫా జంక్షన్‌, ‌పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ ‌చౌక్‌, అలీ జాకోట్ల, ర్‌ ‌మోమిన్‌ ‌దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్‌ ‌గ...
Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Subsidy Gas | 39.50 ల‌క్ష‌ల మందికి రాయితీ గ్యాస్‌.. రేషన్ డీలర్లకు కీలక సూచనలు

Telangana
Subsidy Gas : అతి త్వ‌ర‌లో మరో 2 గ్యారెంటీల (Congress Guarantees)ను అమలు చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29వ తేదీన‌ ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 39.50 లక్షల మందికి ఈ ప‌థ‌కం కింద రూ.500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించనున్నారు. అయితే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.రూ.500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌ అందించేందుకు రేవంత్ (Revanth Reddy) నేతృత్వంలోని ప్ర‌భుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 27 లేదా 29వ తేదీన పథకాన్ని ప్రారంభించ‌నుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లు అంద‌రూ సంసిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శాఖ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్‌ ప్రతి...
వారం రోజుల్లోనే రూ.500కి గ్యాస్ సిలిండ‌ర్‌.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

వారం రోజుల్లోనే రూ.500కి గ్యాస్ సిలిండ‌ర్‌.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

Telangana
Rs 500 for Gas cylinder : మ‌రో వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ తోపాటు పేద కుటుంబాల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Free Power) అమలుపై ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సీఎం హోదాలో మొద‌టిసారి త‌న సొంత నియోజకవర్గమైన కొడంగల్ (Kodangal) కు బుధ‌వారం చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గిలో జ‌రిగిన‌ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వచ్చే వారం రోజుల్లోనే 500 రూపాయ‌లకే గ్యాస్ సిలిండర్ (Rs 500 for Gas cylinder) అందించి ఆడప‌డుచుల కష్టాలు తీరుస్తామ‌న్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా అమలు చేస్తామ‌ని, వచ్చే నెల 16 లోగా అర్హ‌లైన రైతుల‌కు రైతు భరోసా (Rythu Bandhu) అందిస్తామని స్ప‌ష్‌టం చేశారు. మ‌రోవైపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని, ఇందులో ఎ...
తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

Telangana
తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన సుప్రసిద్ద గీతం 'జయ జయహే తెలంగాణ' ఎంపిక చేసింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి( RevanthReddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీ (TG) గా మార్చాలని తీర్మానించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని,  అందుకే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. రాష్ట్ర గీతంగా అందెశ్రీ  జయ జయహే తెలంగాణను ఆమోదించింది. ...
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?

New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?

Telangana
New Ration Cards : గత వారం రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. కేవలం ఊహాగానాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలేనని నిర్ధారణ అయింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షలో రేషన్ కార్డుల గురించి ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం 6 గ్యారంటీల అమలుపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలిచ్చారు. వారం రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఎప్పుడు? ఇలా ఉండగా, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా మంజూరు చేస్తుందని ఆశిం...
తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు..  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

తెలంగాణలో రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

Telangana
Telangana Assembly Sessions: తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, వేర్వేరు మార్గాల ద్వారా అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. Telangana Assembly Sessions అసెంబ్లీలో 42పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులందరికీ అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లు ఉండేదని, ఈ పదేళ్ల కాలంలో ఆ అప్పు 24.05 శాతం పెరిగిందని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. రాష్ట్ర అప్పు రూ.3 లక్షల 89వేల 673 కోట్...
KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

KCR | ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా!

Telangana
KCR resigns to Telangana CM Post: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ ఓఎస్డీ తో తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపించారు.ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకుంది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనుకున్న బీఆర్‌ఎస్‌ కు గట్టి షాక్ తగిలింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు తదితరులు బీఆర్‌ఎస్‌ పరాజయాన్నిఅంగీకరించారు. రెండు సార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫ‌లితాలను ఒక పాఠంగా భావిస్తామని, మరలా పుంజుకొంటామని కేటీఆర్‌, హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్య...