RRR Alignment | రీజినల్ రింగ్ రోడ్ పై సర్కారు కీలక ఆదేశాలు.
RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమనగ...