Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరానికి భారీ విరాళాలు.. ఎంతకీ తగ్గని రద్దీ..
స్వామివారి దర్శన సమయాలను పొడింగించిన ఆలయ ట్రస్టు
Ayodhya Ram Mandir | అయోధ్యలో నూతనంగా ప్రారంభించిన రామ మందిరం (Ram Temple) లో బాలరాముడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గత సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సాధారణ భక్తుల కు రామయ్య దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజు రామ మందిరానికి భక్తులు భారీగా విరాళాలు (Donation) సమర్పించుకున్నారు.సాధారణ భక్తులకు అనుమతించిన తొలి రోజే రామ మందిరానికి రూ.3 కోట్లకు పైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఆలయంలో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక కౌంటర్లతోపాటు, ఆన్‌లైన్ ద్వారా భక్తులు మొత్తం రూ.3.17 కోట్లు విరాళంగా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు.మరోవైపు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్...