Mahalakshmi scheme | రాహుల్ గాంధీ రూ.లక్ష ప్రకటనతో ఖాతాలు తెరిచేందుకు పోటెత్తిన మహిళలు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘మహాలక్ష్మి’ పథకం (Mahalakshmi scheme) కింద మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిచేందుకు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPBP) ఖాతాలను తెరవడానికి మహిళలు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చారు.గత రెండు రోజులుగా పోస్టాఫీసు వద్ద మహిళల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం.. ఖాతా తెరవడానికి మే 27 చివరి రోజు అని వాట్సాప్లో పుకార్లు వ్యాపించడంతో మహిళల సంఖ్య రెట్టింపయింది. ఈ తప్పుడు సమాచారం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తెల్లవారక ముందే పోస్టాఫీసుకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తోపులాటలు జరగకుండా పోలీసులను రప్పించారు.Mahalakshmi scheme కింద అయితే రూ. లక్ష జమ ...