Friday, January 23Thank you for visiting

Tag: PM modi

Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

Modi Cabinet 3.0 | మోదీ మంత్రి వర్గంలో ఎవరెవరు ఉన్నారు..? పోర్ట్ ఫోలియో పూర్తి జాబితా ఇదే..

National
Modi Cabinet Portfolio List  | ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసిన ఒక రోజు తర్వాత, మంత్రులకు మంగళవారం సాయంత్రం శాఖలను కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన హోం, ఆర్థిక, రక్షణ, రోడ్డు రవాణా, రహదారులు, జయశంకర్ కు విదేశాంగ శాఖలను  పాత వారికే కేటాయించారు. గాంధీనగర్‌ ఎం‌పీ అమిత్‌ ‌షాకు హోం ‌మంత్రిత్వ శాఖను, రాజ్య సభ ఎంపీ నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, లక్నౌ ఎంపీ రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు రక్షణ శాఖ, బీజేపీ సీనియర్‌ ‌నేత, నాగ్‌పూర్‌ ఎం‌పీ నితిన్‌ ‌గడ్కరీకి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలనే మళ్లీ కేటాయించారు. ఇక  అశ్విని వైష్ణవ్‌ ‌రైల్వే మంత్రిత్వ శాఖను కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో పూర్తి జాబితా  (Modi Cabinet Portfolio List ) రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ): రక్షణ మంత్రిత్వ శాఖఅమిత్ షా (బిజెపి): హోం మంత్రిత్వ శాఖ; సహకార మంత్రిత్వ శాఖనితిన్ గడ్కరీ (బిజెపి): రోడ్డు...
PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే..  రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

PM Modi Cabinet Meeting | ప్రధాని మోదీ తొలి సంతకం ఈ ఫైల్ పైనే.. రైతులకు నిరుపేద‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌..

National
PM Modi Cabinet Meeting | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర‌ మోదీ (PM Modi) వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు న‌మోదు చేశారు. ఆయ‌న‌తోపాటు 72 మందితో కేంద్ర మంత్రులు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ టీమ్ లో 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా చాన్స్‌ లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గం లో అవ‌కాశం కల్పించారు. అయితే మోదీ 3.0 కేబినెట్ తొలిసారి ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో సమావేశం కానుంది.ఈ కీల‌క స‌మావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (Pradhan Mantri Awaas Yojana-Gramin) కింద 2 కోట్ల అదనపు గృహాలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని కూడా సు...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...
Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

Modi cabinet 2024 | 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో మొట్ట‌మొద‌టిసారి కేంద్ర మంత్రి ప‌ద‌వి

National, తాజా వార్తలు
Shivraj Singh Chouhan | బీజేపీ సీనియ‌ర్ నేత శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 30 ఏళ్ల‌కు పైగా పార్టీ ప‌ద‌వుల్లో సేవ‌లందిస్తున్నారు. నాలుగు సార్లుముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కానీ గత ఏడాది ఐదవసారి ముఖ్యమంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌కుండా దూరం పెట్టింది. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని విదిషా లోక్‌సభ స్థానం నుంచి ఆరోసారి రికార్డు స్థాయిలో 8.21 లక్షల ఓట్ల తేడాతో ఘ‌న విజయం సాధించారు.నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయించి (2018లో) 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న సమయంలో, చౌహాన్ తనను తాను బలహీనమైన రాజకీయ నాయకుడి నుంచి అసమానమైన కృషితో తెలివైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌గా ఎదిగారు.65 ఏళ్ల చౌహాన్ రాష్ట్రంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించారు. రాష్ట్రాన్ని మ‌రింత‌ అభివృద్ధి చేస్తాన‌ని వాగ్దానం చేస్తూ ప్రజల్లో తానూ ఒకడిగా చూ...
MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !

National, తాజా వార్తలు
Narendra Modi oath-taking ceremony | న్యూఢిల్లీ: బీహార్‌లో ఎన్‌డిఎ (NDA) కూటమిలో భాగంగా పోటీ చేసిన మొత్తం ఐదుకు ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న యువ నేత, ఎల్‌జెపి (రామ్ విలాస్) పార్టీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ (chirag paswan) , మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌నున్నారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు పాశ్వాన్‌కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నుంచి కాల్ వచ్చినట్లు తెలిసింది.మొదటి, రెండవ విడ‌త‌ నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వాలలో సైతం మంత్రివ‌ర్గంలో చిరాగ్ పాశ్వాన్‌కు చోటు ద‌క్కింది. పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు, ఆయ‌న తండ్రి రికార్డుస్థాయిలో 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. రాజ‌కీయాల్లో తన తండ్రి బాట‌లో న‌డిచిన‌ చిరాగ్ పాశ్వాన్.. త‌న ప్రయాణంలో ఈ ఎన్నికలు కీలక మైలురాయిగా నిలిచాయి. ఎల్‌జేపీ లో చిరాగ్...
Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది…!

Vane Bharat Express | వందే భారత్‌ రైళ్ల వేగం త‌గ్గింది…!

National
Vane Bharat Express Speed | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ప్ర‌యాణికుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో భార‌తీయ రైల్వే దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్ల సంఖ్యను క్ర‌మంగా పెంచుకుంటూ వ‌స్తోంది. తక్కువ టైంలో సుదూర గమ్య‌స్థానాల‌కు వెళ్లడానికి ఎక్కువ మంది ప్ర‌యాణికులు ఈ వందేభార‌త్ రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్నాళ్లుగా వందే భారత్‌ రైళ్ల వేగం క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ట్లు తెలిసింది. గ‌త మూడేండ్లలో వందే భారత్‌ రైళ్ల స్పీడ్‌ గంటకు 84.48 కిలోమీటర్ల నుంచి 76.25 కిలోమీటర్లకు పడిపోయింది. ఈ విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఒక‌ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ స‌మాధానం ఇచ్చింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్ స‌మాచార హ‌క్కుచ ట్టం కింద‌ దరఖాస్తు చేయ‌గా రైల్వే అధికారులు సమాధానమిచ్చారు.IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరల...
Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ 

Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ 

National
Nitish Kumar NDA Meeting | న్యూఢిల్లీ: ఎన్డీఏ (NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును (PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) , చంద్ర‌బాబు స‌హా, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు న‌రేంద్ర‌ మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డీఏ.. కొత్తగా ఎన్నికైన ఎంపిల సమావేశం దిల్లీలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నితిష్ కుమార్ మాట్లాడుతూ.. ఇండియా కూట‌మికి పొర‌పాటున ఎక్కువ సీట్లు వ‌చ్చాయ‌ని, ఈ బృందం "ఏ పని చేయలేదని పేర్కొన్నారు. "నేను అన్ని వేళలా ప్రధానమంత్రితో ఉంటాను" అని కూడా ప్రకటించారు. నితీష్ కుమార్ మోడీకి మద్దతు ప్రకటించడం.. ఒక‌వైపు ఇండి కూటమి ఆశ‌ల‌కు గండిప‌డిన‌ట్లైంది.లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇద్దరు కింగ్‌మేకర్లు అవతరించారు. JDU నుండి 12 మంది. చంద్రబాబు నాయుడు TDP నుంచి 16 మంది ఎంపీల మ‌ద్ద‌తుతో ఎన్ డీఏ ప్ర‌భుత్వాన్ని ...
PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

Elections, National
PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...
BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..

BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..

Elections
BJP on Reservation | అనేక సందర్భాల్లో రిజర్వేషన్ల (Reservation) ను పునర్విభజన చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని బీజేపీ తన తాజా ప్రకటన ద్వారా బహిర్గతం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల 7వ, చివరి దశకు దేశం సిద్ధమవుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం #MeraVoteMeraAdhikar అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. అందులో రిజ‌ర్వేష‌న్ల పున‌ర్విభ‌జ‌న‌పై కాంగ్రెస్ ఉద్దేశాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించింది. 'మైనారిటీ' వర్గాలను సంతృప్తి పరచడానికి మన దళిత, గిరిజన, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను త‌గ్గించిన విష‌యాన్ని ఆ ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్తావించింది. .BJP on Reservation : 48 సెకన్ల నిడివి గ‌ల‌ వీడియోలో, SC/ST/OBC రిజర్వేషన్ల గురించి అట్టడుగు వర్గాల్లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మాస్ హిస్టీరియా సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా మార్చి...
Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

Special Stories
Jammu And Kashmir :  2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కాశ్మీర్ లోయ అత్యధిక ఓటింగ్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే లోయలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. రికార్డు స్థాయి పోలింగ్.. జమ్మూ కాశ్మీర్‌లో బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరీ, ఉధంపూర్, జమ్మూతో సహా ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 25 వరకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా, ఉధంపూర్, జమ్మూలో ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉధంపూర్ 2019లో 70.15%తో పోలిస్తే 2024లో 68.27% నమోదైంది , జమ్మూ 2024లో 72.22% వద్ద ఉండగా, 2019లో 72.5% ఉంది.అయితే మిగతా మూడు స్థానాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024...