Saturday, August 30Thank you for visiting

Tag: PM modi

Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Trending News
Sudarshan Setu | దేశంలోనే అత్యంత‌ పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గ‌ల ఈ వంతెన పొడ‌వు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారకా (Beyt Dwarka)తో క‌లుపుతుంది.2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గ‌ల‌ ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్‌ సేతు ను ఒక విల‌క్ష‌ణ‌మైన‌ డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఆక‌ట్టుకుంటాయి. Longest Cable Stayed Bri...
తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

National
 26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీRailway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.  రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరణ  లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా పెద్దఎత్తున పురోగతి సాధించింది.  మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇన్నాళ్లు రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయ...
PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..

PM Vishwakarma Scheme : పీఎం విశ్వకర్మ స్కీమ్.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి, వివరాలివే..

Special Stories
PM Vishwakarma Scheme Application : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. సంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థిక సాయంతోపాటు, వృత్తిలో అవసరమైన శిక్షణ అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే స్కీమ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి..Pm Vishwakarma Yojana Scheme Updates : చేతివృత్తులు చేసుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్న పేద కుటుంబాల కోసం మోదీ నేతృత్వంలోని కేంద్ర‌ ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలుచేస్తోంది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పుర‌స్క‌రించుకొని గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.. ఈ పథకానికి 18 రకాల చేతివృత్తుల వారు అర్హులుగా నిర్ణ‌యించారు. ఈ స్కీమ్ కు ఎంపికైతే రూ.3 లక్షల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఇదీ.. ఎవ‌రు అర్హులు? సంప్రదాయ కులవృత్తులు అయిన శ...
Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Rooftop Solar Scheme: ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

Special Stories
Rooftop Solar Scheme: ప్రజలు తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. ఈ పథకానికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని మోదీ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన ( PM Surya Ghar, Muft Bijli Yojana) ,  కింద ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా 1 కోటి గృహాల్లో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-'25 మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు.Free Rooftop Solar Scheme సోలార్ ప్యానెల్ పథకం కింద, పథకం లబ్ధిదారులకు భారీగా సబ్సిడీలు అందించబడతాయని, వాటిని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని మోడీ చెప్పారు. భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల అందించి , ప్రజలపై ఎటువంటి వ్యయ భారం లేకుండా ...
BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

World
BAPS Hindu Mandir :  అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది  ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో  అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది.  ఈ ఆలయాన్ని రేపు  14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన  భారీ సమావేశం జరుగుతుంది. దీనికి  అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం  2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి  శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా.. ఈ భారీ దేవాలయం (B...
PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

PV Narasimha Rao | మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపిన కేసీఆర్

National
PV Narasimha Rao | హైద‌రాబాద్ : భార‌త దివంగత మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ‌ పీవీ న‌ర‌సింహ రావుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డంపై  మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ ట్వీట్ చేశారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించ‌డంపై  ఎక్స్ వేదిక‌గా కేసీఆర్ ప్రధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. పీవీ న‌ర‌సింహా రావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆనందాన్ని  క‌లిగించింది అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో పీవీది కీలక పాత్ర : ప్రధాని మోదీ PM Modi | దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ న‌ర్సింహారావుకు భారతరత్న వరించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ .. సోషల్‌ మీడ...
ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు

ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు

National
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది.  ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక ముఖ్యమైన భాగం. వారు అలుపెరగకుండా గంటల తరబడి వాహనాలను నడుపుతూనే ఉంటారు. కానీ వారికి సరైన విశ్రాంతి స్థలం అందుబాటులో లేదు. వారికి తగిన సమయం కూడా దొరకదు.  సరైన విశ్రాంతి లేకపోవడం నిద్రలేమీకారణంగా  కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుంది."ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనలను తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ప్రధాని మ...
BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన  బీజేపీ 

BJP campaign video : 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార గీతాన్ని ఆవిష్కరించిన  బీజేపీ 

National
BJP campaign video : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ పూర్తి కావడంతో 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా "సప్నే నహీ హకీకత్ బంతే హై, తాభీ తో సబ్ మోడీ కో చుంటే హై " అనే పాట (BJP song ) ను విడుదల చేశారు. మొదటి సారి ఓటర్ల సమ్మేళనం (నవ్ మత్తత సమ్మేళన్) లో జరిగిన ప్రచార ప్రారంభం సందర్భంగా కోట్లాది మంది భారతీయుల కలలు, ఆకాంక్షలను ప్రధాని మోదీ ఎలా నిజం చేశారో తెలిపే మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు.ఈ సందర్భంగా జేపీ నడ్డా (JP Nadda) మాట్లాడుతూ.. ఈ ప్రచార నినాదం కేవలం కొద్దిమంది అనుభవించిన సెంటిమెంట్ మాత్రమే కాదు.. అది జనంలో ప్రతిధ్వనిస్తుందని బిజెపి గట్టిగా నమ్ముతుంది" అని పార్టీ పేర్కొంది. పార్టీ కార్యకర్తలందరూ  దేశంలోని ప్రతి మూలక...
Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం

Pradhan Mantri Suryodaya Yojana : పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కరెంటు బిల్లులు తగ్గించే కేంద్రం కొత్త పథకం

National
Pradhan Mantri Suryodaya Yojana : పేద మధ్య తరగతి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత  మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. "ప్రధానమంత్రి సూర్యోదయ యోజన" (Pradhanmantri Suryoday Yojana) పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకొస్తున్నట్లు  చెప్పారు. దీని కింద దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ సిస్టంలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని భక్తులు అందరూ నిరంతరం సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు.. ఈరోజు, అయోధ్యలో పవిత్ర కార్యక్రమం తర్వాత  దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ పవర్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలని నా సంకల్పం మరింత బలపడింది. అని అన్నారు.అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తరువాత నేను తీసుకున్న తొలి  నిర్ణయం...
Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..

Special Stories
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాల గురించి తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఒకసారి చూడండి.. ఆలయ ప్రత్యేకతలు (Ram Mandir specialities)భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం అయోధ్య రామ మంది...