Hyderabad Metro | రాష్ట్ర బడ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు
Hyderabad Metro | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కాగా, 2024 - 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్...