Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది.
నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు..
ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు నాలుగు ఓవర్‌హెడ్ స్టేషన్లు – సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా వద్ద నిర్మించనున్నారు. ఆ మార్గంలో ఉన్న ఆస్తులను వినియోగించుకుంటున్న వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు భూ యాజమాన్య వివరాలను పరిశీలించేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించారు. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున ఈ ప్రక్రియ ఎన్నికల తర్వాతే పూర్తయ్యే ఛాన్స్ ఉంది.
షాలీబండ నుంచి ఫలక్‌నుమా వరకు రహదారి ఇప్పటికే 80 అడుగుల వెడల్పుతో ఉన్నందున 5.5 కిలోమీటర్లలో 2.5 కిలోమీటర్ల వెడల్పు అవసరం లేదని మెట్రో రైలు అధికారులు గుర్తించారు. దారుల్‌షిఫా నుంచి శాలిబండ వరకు రోడ్డు వెడల్పు దాదాపు 60 అడుగులు, ఇరువైపులా శిథిలావస్థకు చేరిన భవనాలు, చిన్నచిన్న దుకాణాలను ఏర్పాటు చేయడం వల్ల మెట్రో పనులు సవాలుతో కూడుకున్నది.
Also Read : ప్రపంచంలోనే అతిపెద్దదైన మెట్రో రైల్ నెట్ వర్క్.. అతిపెద్ద స్టేషన్ ఏదీ..
Old city metro line మార్గంలో ఉన్న 103 మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను తప్పించుకోవడానికి మా కన్సల్టెంట్ సహాయంతో ఇంజనీరింగ్ పరిష్కారాలను కనుగొనేందుకు ప్రణాళికలు చేస్తున్నామని ”HMR మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి మీడియాతో అన్నారు. “మేము సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు వయాడక్ట్‌ను నిర్మించాము, ఇక్కడ రహదారి కేవలం 40 అడుగుల వెడల్పుతో ఉంది. ఇంజినీరింగ్ పరంగా నగరంలోని ఈ భాగంలో మెట్రో లైన్ నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నదని చెప్పారు. మేము ప్రజల నుండి సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు.
HMR ఇప్పటికే MGBS వద్ద 500-మీటర్ల ‘రివర్సల్’ వయాడక్ట్‌ని L&T మెట్రో రైల్ హైదరాబాద్ (L&TMRH) నిర్మించింది. మొదటి దశలో రైళ్లు రివర్స్ చేయడానికి, తిరిగి స్టేషన్‌లోకి వెళ్లడానికి పని పాయింట్ ఉపయోగపడుతుంది. ఫలక్‌నుమా వద్ద దాదాపు 500 మీటర్ల మేర మరో రివర్సల్ వయాడక్ట్ ఉంటుంది. దీనిని ఫ్లైఓవర్ సమీపంలోని చాంద్రాయణగుట్ట వరకు 1.5 కి.మీ వరకు పొడిగించవచ్చు, తదుపరి దశలో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగింపు చేపట్టిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్ , JBS స్టేషన్‌ల తరహాలో ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..