Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: New Railway Projects

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Andhrapradesh

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ...
Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ – హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌
Telangana

Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ – హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

హ‌స‌న్ ప‌ర్తి రోడ్ స్టేష‌న్ క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య రైల్వేలైన్ నిర్మాణంపై క‌ద‌లిక‌ Karimnagar - Hasanparthy Railway Line  | కరీంనగర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల‌ను కలుపుతూ రెండో రైల్వే లైన్ నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. హనుమకొండ జిల్లా ప‌రిధిలోని లోని హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేష‌న్ నుంచి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ మధ్య రైల్వేలైన్ కోసం రెండు జిల్లాల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైలు మార్గంపై ఎట్ట‌కేల‌కు ఆశ‌లు చిగురిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ గ‌త మంగ‌ళ‌వారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. క‌రీంన‌గ‌ర్ రైల్వే లైన్ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా పనుల‌ను త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారువరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు ప్ర‌స్త‌తుం రోడ్డు మార్గ‌మే శ‌ర‌ణ్యం. నిత్యం వంద‌లాది ఆర్టీసీ బ‌స్స...
Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు
Telangana

Railway Projects in Telangana | చురుగ్గా మనోహరాబాద్-కొత్తపల్లి, కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ల ప‌నులు

Railway Projects in Telangana | కేంద్ర ప్రభుత్వం దేశ్యాప్తంగా కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్త బడ్జెట్ కాలపరిధిలో ఆయా ప‌నులు పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో మెదక్-అక్కన్నపేట, మహబూబ్ న‌గ‌ర్ డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. అలాగే ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో క‌ద‌లిక తీసుకొచ్చింది. ఈనెల 23న ప్రవేశ పెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి బడ్జెట్లో ఆ నిధులను కేటాయించే అవకాశముంది. దీంతో ఈ సంవత్సరంలో తుది దశకు చేర‌నున్న‌ట్లు భావిస్తున్నారు. కాజీపేట- విజయవాడ, కాజీపేట బ‌ల్లార్షా మూడో లైన్ Kazipet Vijayawada Railway line : కాజీపేట- విజయవాడ మూడో లైన్ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. కానీ, పనులు మాత్రం న‌త్త‌న‌డ‌క‌న సాగుతూ...
New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ
Telangana

New Railway Line | తెరపైకి మరో కొత్త రైల్వే లైన్.. సర్వే పనులు ప్రారంభించిన రైల్వే శాఖ

Zahirabad Railway Line | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో సరికొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పాత రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, కొత్త రైల్వే లైన్ల పనులు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి పనులను ముమ్మరంగా చేస్తోంది.  మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో  కొత్త రైల్వే లైన్ల కోసం సర్వేలు జరుగుతున్నాయి. అయితే  కొత్తగా తాండూరు నుంచి జహీరాబాద్ వరకు కొత్త రైల్వే లైన్  నిర్మించనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం  చేశారు. సర్వే పనులు పూర్తి కాగానే రూ.1400 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనను అమలుచేయనున్నారు. గంటన్నరలోనే తాండూరు నుంచి జహీరాబాద్ కు.. ఈ కొత్త రైల్వే లైన్  అందుబాటులోకి వస్తే తాండూరు నుంచి జహీరాబాద్చే (Thandur to...
Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..
Andhrapradesh

Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..

Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శ‌ర‌వేగంగా స‌రికొత్త‌ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశ‌లు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న‌పుడు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమరావతి రైల్వేలైన్‌ ప్రతిపాదనను అట‌కెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ వేగంగా స్పందించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో రైల్వే అనేక షరతులు విధించింది. రాష్ట్రం తన వాటాను అందించాలని అలాగే భూసేకరణ ఖర్చులను కూడా భరించాలని సూచించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలాంటి షరతులు వి...