Wednesday, December 18Thank you for visiting
Shadow

Tag: National

పార్లమెంట్‌లో  విపక్షాల్లో చీలికలు మొదలు..

పార్లమెంట్‌లో విపక్షాల్లో చీలికలు మొదలు..

National
Opposition Protests in Parliament : అదానీ కేసుకు సంబంధించి గురువారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విపక్షాలు నిరసన తెలిపాయి. ఈ ప్రదర్శనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ప్రతిపక్ష నేతలు నల్ల కోటు ధరించి నినాదాలు చేశారు. ఈ జాకెట్‌పై 'అదానీ, మోదీ ఒక్కటే' అని రాసి ఉంది. అదానీపై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ దర్యాప్తు చేయబోరని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్‌లో నిరసనల విషయంలో ప్రతిపక్షంలో కూడా చీలిక వచ్చింది. ఈ నిరసనకు మమ్మల్ని ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ అన్నారు. అదానీ ఇష్యూ కంటే సంభాల్ ఇష్యూ పెద్దది. సంభాల్ విషయంలో ఎస్పీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. మోదీ-అదానీ ఒక్కటే: రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎస్పీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. పా...
Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Business
Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి.“ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చి...
ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

National
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భార‌త్ ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంత‌మైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాల క్రితం భార‌త్‌ 5వ స్థానంలో ఉండేది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో చిన్న మార్కెట్‌గా ఉంది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. US మరియు చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. నేడు, యుఎస్, చైనా అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్లుగా కొన‌సాగుతున్నాయి."అయితే, భారతదేశం బ్రెజిలియన్, ఇండోనేషియా దేశీయ మార్కెట్‌లను ప‌క్క‌కు నెట్టి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంతో మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తోంది" అని OAG డేటా తెలిపింది. 10-సంవత్సరాల సగటు కంటే దేశీయ విమాన‌యాన‌ సీట్ల సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది....
MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు..  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

National
MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది.#Cabinet approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2024-25The highest absolute increase in MSP over the previous year has been recommended for oilseeds and pulses#CabinetDecisions pic.twitter.com/zhqhXyNzut — Sheyphali ...
Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన

Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన

Trending News
Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే,  ఆమె రాకను వ్యతిరేకిస్తూ..  గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌ను 'ముస్లిం'కి కేటాయించడాన్ని వ్యతిరేకించారు.2020లో నివాసితులు తన కేటాయింపును చెల్లదని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) లేఖ రాయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయని  సదరు మహిళ మీడియాతో అన్నారు. అయితే, ఆ సమయంలో పోలీసులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసి అక్కడితోనే వదిలేశారు. అయితే తాజాగా జూన్ 10...
Delhi Water crisis | తాగునీటి ఎద్ద‌డితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు

Delhi Water crisis | తాగునీటి ఎద్ద‌డితో అల్లాడుతున్న ఢిల్లీ వాసులు

National
Delhi Water crisis  | దేశ రాజధానిలో ఢిల్లీలో తాగునీటి కొర‌త ప్ర‌జ‌ల‌ను వేధిస్తోంది. గుక్కెడు నీటి కోసం అంద‌రూ అల్లాడిపోతున్నారు. నీటి కొరత ఉన్న నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక నెల పాటు అదనంగా నీటి సరఫరాను కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్రం, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానిలో వేడిగాలుల పెరిగాయ‌ని, నీటి అవసరం కూడా గ‌ణ‌నీయంగా పెరిగిందని ఢిల్లీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. మండుతున్న వేడిలో దేశ రాజధాని అవసరాలను తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిటిషన్‌లో పేర్కొంది.హర్యానా అవసరమైనంత నీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ మంత్రి అతిషి కేంద్రానికి లేఖ కూడా రాశారు. "దిల్లీ తన రోజువారీ నీటి డిమాండ్ కోసం యమునా నది నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంది. అయితే, హర్యానా వజీరాబాద్ బ్యారేజీని విడుదల చేయకపోవడంతో గత కొన్ని రోజులుగా, వజీరాబాద్ బ్యారేజీ వద్ద నీటి మట్...
Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

National
Protests in PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pakistan-occupied Kashmir) అట్టుడుకుతోంది. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు (Violence) చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శనివారం జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో 90 మంది గాయపడ్డారు. ముజఫరాబాద్‌లో హింస చెలరేగడంతో మిర్పూర్, ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ (ఎజెకె)లో మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు వరుసగా రెండవ రోజు కూడా వేసివేశారు. అవామీ యాక్షన్ కమిటీ (AAC) శుక్రవారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా PoK లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టింది. ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు య‌త్నించ‌గా ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డారు. ముజఫరాబాద్‌లో వీల్-జామ్, షట్టర్-డౌన్ సమ్మె కార‌ణంగా మే 10న సాదార‌ణ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది.అధిక పన్నులు, విద్యుత్ బిల్లులు, ద్రవ్యోల్బణం (Inflation) ఒక్కసారిగా పెర‌గ‌డంతో పీవోకేలోని ప...
Gouri Shankar temple :  హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

Gouri Shankar temple : హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలు..

National
Gouri Shankar temple : జ‌మ్మూ క‌శ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆల‌యం కోసం ఇద్ద‌రు ముస్లింలు త‌మ భూమిని విరాళంగా ఇచ్చి మ‌త సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి జిల్లా (Reasi district) కాన్సి పట్టా గ్రామంలో 500 సంవత్సరాల నాటి పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ భూమిలో గౌరీ శంకర్ ఆలయాన్ని కలుపుతూ రోడ్డు నిర్మించ‌నున్నారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ నాలుగు కెనాల్ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. దీని విలువ‌ సుమారు కోటి రూపాయల అంచనా. కాగా ఈ స్థలంలో ఆల‌యం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు.పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో టెంపుల్ రోడ్ నిర్మించడానికి ముస్లింలు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రస...
పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Elections, National
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్‌ ను గౌరవించాలని, ఆ దేశంతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని పార్టీ కురువృద్ధుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్‌ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వ‌ద్ద అణుబాంబులు ఉన్నాయ‌ని, ఒక‌వేళ మ‌న ప్ర‌భుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మ‌నపై బాంబులు వేసే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల ఒక‌ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌ణిశంక‌ర్ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యింది. మ‌నం పాకిస్థాన్‌ను గౌర‌వించాల‌ని, ఎందుకంటే ఆ దేశం వ‌ద్ద అణు బాంబు ఉంద‌ని, వాళ్ల‌ను మ‌నం గౌర‌వించ‌కుంటే వాళ్లు మ‌న‌పై బాంబుల‌ను వాడే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అయ్య‌ర్ వెల్ల‌డిం...
కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Elections, National
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...