
Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?
Hyderabad New Metro Stations | హైదరాబాద్: కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్, స్టేషన్ స్థానాలను ఖరారు చేసేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HMAL ) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి శనివారం నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించారు.కొత్త నాగోల్ ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్‌కు సమీపంలోనే ఉంటుంది. ఈ రెండు స్టేషన్ల ప్రయాణీకుల సౌకర్యార్థం కాన్కోర్స్ స్థాయిలో స్కైవాక్‌తో అనుసంధానించనున్నారు. భారీ నీటి పైపులు, హై టెన్షన్ ఎలక్ట్రికల్ లైన్‌లు మారకుండా ఉండేందుకు మూసీ దగ్గర దాదాపు 10 మీటర్ల వరకు అలైన్‌మెంట్ ఎడమ వైపుకు మార్చాలి. మూసీ నదిని దాటడానికి, మూసీ పునరుజ్జీవన పనులను సులభతరం చేయడానికి ఎక్కువ పొడవైన మార్గాలను ప్లాన్ చేయాలి.కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి సమీపంలోని కాలనీల ప్రయాణ అవసరాలకు కనెక్ట...