Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Lok Sabha elections

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు
Elections, National

PM Modi 3.0 | మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారు

PM Modi 3.0 |  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిద్వారా భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలోని మొదటి ( ఏకైక) మూడు పర్యాయాలు ప్రధాని అయిన వ్యక్తి గా మోదీ (PM Modi 3.0) నిలవనున్నారు. కాగాప్రధాని మోదీ తన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అలాగే తన పదవికి రాజీనామాను అందజేశారు. జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.2014లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది.  272 మెజారిటీ మార్కుకు 32 తక్కువ. ఇది ఇప్పుడు మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు గెలుచుకున్న 53 స్థానాలపై ఆధారపడుతుంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో త...
Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
Elections

Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

How to check poll results on ECI website | యావ‌త్ భార‌తదేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఇత‌ర‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొద‌ల‌వుతుంది. ఓట్ల లెక్కింపు కోసం  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటరు తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలపై అప్‌డేట్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి.Lok Sabha election 2024 results : 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల పోలింగ్ జూన్ 1న‌, శనివారం ముగిసింది, ఫలితాలు మంగళవారం జూన్ 4న ప్రకటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా మొద‌టి ద‌శ పోలింగ్‌ ఏప్రిల్ ...
Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..
Elections

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్)బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...
Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..
Elections

Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..

Opinion Polls vs Exit Polls | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సహా రాజకీయ నిపుణులు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయినా ప్రతిపక్షం చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. జూన్ 1న చివరి దశ ఎన్నికల ముగింపు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే , ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతాయి. ఇది జూన్ 4న ప్రకటించబడే తుది ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే ఒక అంచ‌నా అందిస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమ‌లులో ఉంటుంది. కాబ‌ట్టి ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు.ఎన్నికల సీజన్‌లలో ఓట‌రు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడ‌నే విష‌యంపై ఒపీనియన్ పోల్స్, ...
Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..
Elections

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగ...
Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన
National

Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన

Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. కాగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మ‌నం గౌరవించాలని మణిశంకర్‌ అయ్యర్‌ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూట‌మి నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.. దీనిపై అమిత్ షా స్పందిస్తూ నేను కాంగ్రెస్‌, భారత కూటమికి చెప్పాలనుకుంటున్నాను పీఓకే భారత్‌కు చెందినది, దానిని ఏ శక్తీ లాక్కోలేదు’’ అని జార్ఖండ్‌లోని ఖుంటిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా అన్నారు.కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, “కాంగ్రెస్‌కు ఏమైందో నాకు తెలియదు. పీఓకే భారతదేశంలో భాగమని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కానీ మీరు (కాం...
Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Elections, National

Muslims reservations | నేను ముస్లిం వ్యతిరేకిని కాదు.. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేట‌పుడు ప్ర‌తీఒక్క‌రూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి స‌మాజం గురించి ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే ప‌దాల‌ను వాడ‌డంతో ఆయ‌న‌పై ఇండి కూట‌మి నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. ద...
Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై  క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..
Elections

Fourth Phase Election | నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ADR నివేదికలో సంచ‌లన‌ విష‌యాలు..

Fourth Phase Election| నాలుగో విడ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 96 నియోజకవర్గాల్లో 58 (60%) నియోజకవర్గాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక నియోజకవర్గంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్న‌ట్లు అఫిడ‌విట్ లో పేర్కొన్న‌ట్ల‌యితే అలాంటి చోట రెడ్‌ అలర్ట్ ఉంటుంది. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( Association For Democratic Reforms - ADR) ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో 4వ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మంది అభ్యర్థులు, మొత్తం 1,710 మంది అభ్యర్థుల్లో 360 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయ‌ని వెల్లడించింది.మే 13న 4వ దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేస్తున్న 1,717 మంది అభ్యర్థుల్లో 1,710 మంది స్వీయ ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. ADR నివేదిక ప్రకారం, మొత్తం 360 (21%) మంది అభ్యర్థులు క్రి...
Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర‌వింద‌ర్ సింగ్ లవ్లీ
Elections

Lok Sabha Elections | బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ అర‌వింద‌ర్ సింగ్ లవ్లీ

Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఢిల్లీ మాజీ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) ఈరోజు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ (Congress) మాజీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్‌ చౌహాన్‌, నసీబ్‌ సింగ్‌, నీరజ్‌ బసోయా, యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అమిత్‌ మల్లిక్‌లతో పాటు ఢిల్లీ మాజీ చీఫ్‌, కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ సమక్షంలో బీజేపీలో చేరారు.గతంలో ఏప్రిల్ 28న Arvinder Singh Lovely కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో పొత్తు పెట్టుకోవడమే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు, కల్పిత, దురుద్దేశపూరిత అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతో మ‌ళ్లీ పొత్తు పె...
Rahul Gandhi : వీడిన సస్పెన్స్..  రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ
Elections

Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రెండు బలమైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎవ‌ర‌నే దానిపై నెలరోజుల ఊహాగానాలకు ఎట్ట‌కేల‌కు ముగింపు పలికింది. రాయ్‌బరేలీ (Raebareli) నుంచి రాహుల్ గాంధీ పేరు ను పార్టీ ప్రకటించింది. అదే సమయంలో గాంధీల కుటుంబానికి మొదటి నుంచి వీరవిధేయుడైన కిషోరి లాల్ శర్మ(Kishor lal Sharma) అమేథీ (Amethi) నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ మే 3. కాగా ఈ రాయ్‌బరేలీ అమేథీలకు మే 20న 5వ దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత, రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ పార్లమెంటు సభ్యుడి ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాయ్‌బరేలీ ...