
Underwater Metro Train : దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రైన్.. ఎక్కడుంది.. ప్రత్యకతలు ఏమిటీ?
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన భారతదేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న నది కింద ఈ టన్నెల్ ను నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌కతాలో రవాణా సులభతరం కానుంది.కోల్ కతాలోని ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ లో ప్రధాని మోదీ తొలిసారి విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్లతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ అండర్ వాటర్ మెట్రో లైన్ కోల్‌కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్‌లను అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా, అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి.
...