Wednesday, July 30Thank you for visiting

Tag: kazipet

Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్‌.. మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు!

Special Trains | పండుగ వేళ గుడ్ న్యూస్‌.. మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు!

Telangana
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌లోనూ నడిపిస్తున్నట్లు పేర్కొంది. గోరక్‌పూర్‌ – మహబూబ్‌నగర్‌ (05303) మధ్య అక్టోబర్‌ 12, 19, 26 మధ్య ప్రతీ శనివారం స్పెష‌ల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తాయని వెల్ల‌డించింది.ఇక మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌ (05304) మధ్య మీదుగా అక్టోబర్‌ 13, 20, 27వ‌ తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రైలు జడ్చర్ల, షాద్‌నగర్‌, ఉమ్దానగర్‌, కాచిగూడ, మల్కాజ్‌గిరి, రామగుండం, బెల్లంపల్లి, నాగ్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, ఝాన్సీ, ఒరై, కాన్పూర్‌ సెంట్రల్‌, ఐష్‌బాగ్, బస్తీ స్టేషన్ల మీదుగా గోరక్‌పూర్‌కు రైలు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.అక్టోబర్‌ 21 నుంచ...
New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

Telangana
New Railway Lines | తెలంగాణలో కొత్త రైల్వేపనులను ముందుకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లతో సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు భూమి వాటా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొంతకాలంగా వేచి చూస్తోంది. కొత్తపల్లి - మనోహరాబాద్ లైన్ 151.36 కి.మీ పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టుకు ₹2,780.78 కోట్ల అంచనా వ్యయం (భూమి ధర మినహాయించి), రాజన్న సిరిసిల్లలో దాదాపు 15.3 హెక్టార్ల అటవీ భూమికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. సిద్దిపేట నుంచి మరో ఐదు హెక్టార్లు, రాజన్న-సిరిసిల్లలో 42.4 హెక్టార్లు, కరీంనగర్ జిల్లాల నుంచి 38.2 హెక్టార్లు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే పనుల కోసం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి మొత్తం 1,073.7 హె...
Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Telangana
Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, ...
Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

National, Trending News
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం క‌లిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం త‌గ్గిపోయిన కార‌ణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాల‌న్న కార‌ణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌక‌ర్యాన్ని నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అంద‌రూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.ప్రయాణికుల డిమాండ్ తో ప‌లు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. విజయవాడ మీదుగా రాకపోకలు ...
Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు  రైళ్ల వివరాలు ఇవే..

Railway News | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు రైళ్ల వివరాలు ఇవే..

Telangana
Railway News | హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్ (Kazipet Ballarsha Section) లో   ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు మ‌రికొన్నింటిని దారిమ‌ళ్లించ‌నున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్-రేచిని రైల్వే స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. 26 ఎక్స్ ప్రెస్ రైళ్ల‌ను దారి మళ్లించి నడపించ‌నున్నారు. ఈ వివరాలను దక్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) ఒక‌ ప్రకటనలో పేర్కొంది. యి. Cancellation  Of Trains  (రద్దయిన రైళ్ల వివ‌రాలు)జూన్ 26 నుంచి జులై 6 వ‌ర‌కు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ న‌గ‌ర్ మ‌ధ్య న‌డిచే గే కాగజ్ న‌గ‌ర్‌ గర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు (12757/12758) రద్దయ్యాయి. ఈ నెల 28, జులై 5న పుణె-కాజీపేట ఎక్స్ ప్రెస్ (22151) జూన్ 30, జులై 3న కాజీపేట-పుణె ఎక్స్ప్రెస్ (22152) జూన్ 28న, హైదరాబాద్...
శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి  శ్రావణ మాసోత్సవాలు

శ్వేతార్క గణపతి ఆలయంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు

Local
Kazipet:  హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శుక్రవారం నుంచి (ఆగస్టు 18 ) శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఆగస్టు 18న సంతోషిమాతకు అభిషేకం, 19న శనివారం వేంకటేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు, 20న సంతాన నాగలింగేశ్వరస్వామికి అభిషేకం, 21న సోమవారం నాగేంద్రుడికి, 22న గాయత్రి అమ్మవారికి, 25న శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 26న శనివారం వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు, అలాగే సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం, 27న ఆదివారం ఉదయం లక్ష్మీ నారాయణ హోమం, 31న గురువారం సాయంత్రం రక్షా బంధన్ విశేష పూజలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యే క పూజలు, సెప్టెంబర్ 3న సంకటహర చతుర్థి, శ్వేతార్కమూల గణపతి స్వామివారికి గంధం మరియు పుష్పాభిషేకం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న బు...
భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

భగవద్గీత శ్లోకంతో అలారం మోగే సరికొత్త పరికరం

Local
శ్వేతార్క గణపతి ఆలయంలో ప్రారంభంవరంగల్: హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్వయంభు శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో మంగళవారం కొత్త అలారం సిస్టం ఏర్పాటు చేశారు. ఈ అలారం సిస్టమ్ ఒకసారి సమయాన్ని అనుసరించి అలారం మోగడంతోపాటు ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. దేవాలయ కార్యకర్త గంగుల రాజిరెడ్డి ఈ యంత్ర పరికరాన్ని కొనుగోలు ఆలయానికి బహూకరించారు. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దీనిని ప్రారంభించారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రతి గంటకు ఒకసారి ఈ అలారం మోగుతూ గంటలు కొట్టి ఒక భగవద్గీత శ్లోకాన్ని వినిపిస్తుంది. భక్తులకు సమయం తెలుసుకోవడంతోపాటు భగవద్గీత శ్లోకాలు వినడం కూడా జరగుతుందని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరాన్ని అందించిన గంగుల రాజిరెడ్డికి కార్పొరేటర్ జక్కుల రవీందర్, ఆలయ ప్రతినిధులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర్లు శర్మ, మేనేజర్ లక్క రవి...
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..

వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..

Telangana
దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ సుమారు 4వేల మందికి ఉపాధి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అ...