జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?
Jharkhand Election Result 2024: జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నేతృత్వంలోని NDA ? లేదా JMM నేతృత్వంలోని INDI కూటమా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. శనివారం కీలకమైన "బ్యాలెట్ల యుద్ధం" కోసం వేదిక సిద్ధమైంది . పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రెండ్‌లు, ఫలితాలు ఉదయం 9 గంటలకు ఒక అంచనాకు వస్తాయి. ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.74% ఓటింగ్ నమోదైంది, నవంబర్ 15, 2000న జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఈ కీలక పోటీలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది."నవంబర్ 23న కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల నిష్పక్షపాతంగా లెక్కించడానికి ప్రతి టేబుల్‌కు ARO ఉంటారు. అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్...