
Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి
Tamil Nadu : తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో శనివారం క్యారేజ్‌లో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.దక్షిణ రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. కోచ్‌లో మొత్తం 55 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఓ ప్రయాణికుడు ఒక ప్రైవేట్ పార్టీ కోచ్‌లో " నిబందనలకు విరుద్ధంగా రైలు కోచ్ లో గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చాడు. అదే సిలిండర్ ఈ అగ్నిప్రమాదానికి కారణమైంది. మదురై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనపై మధురై జిల్లా కలెక్టర్ ఎంఎస్ సంగీత మాట్లాడుతూ "ఈ రోజు ఉదయం 5:30 గంటలకు, మదురై రైల్వే స్టేషన్‌లో ఇక్కడ ఆగివున్న కోచ్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉత్తరప్రదేశ్ నుండి ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారు కాఫీ చేయడానికి గ్యా...