Friday, August 1Thank you for visiting

Tag: Indian railway

కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

కొత్త‌గా నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్.. షెడ్యూల్, హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

Telangana
Nagpur-Secunderabad Vande Bharat | నాగ్‌పూర్-సికింద్రాబాద్ మధ్య కొత్త‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు మంగళవారం మినహా ప్రతిరోజు సేవ‌లందించ‌నుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ చేరుకోవడానికి ప్రయాణం 8 గంటలు పడుతుంది అయితే, కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. ఇది 7 గంటల 15 నిమిషాలు పడుతుంది.ఈ రైలు నాగ్‌పూర్ నుంచి ఉదయం 5:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. టైమ్‌టేబుల్‌లో స్వల్ప సర్దుబాట్లు ఉండవచ్చ‌ని గ‌మ‌నించాలి.ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. తగ్గనున్న ప్రయాణ సమయం ఈ కొత్త...
Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం

Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్‌ వద్ద తప్పిన ప్రమాదం

National
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జ‌రిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవ‌ల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర ప‌న్నిన‌ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న జ‌రిగింది. సోలాపూర్‌ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంట‌నే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్‌ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విష‌యం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్‌ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుప‌ట్టాల‌పై కొంద‌రు దుండ‌గులు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గ‌మ‌నించి ఎమ‌ర్జెన్సీ బ్రే...
Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియ‌న్ రైల్వే..

Rail Network ట్రాక్ విద్యుదీకరణలో దూసుకుపోతున్న ఇండియ‌న్ రైల్వే..

National
Rail Network :  రైల్వే ట్రాక్ విస్త‌ర‌ణ‌లో భార‌తీయ రైల్వే దూసుకుపోతోంది. ఇదే విష‌య‌మై న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ (ASSOCHAM) జాతీయ సదస్సులో రైల్వే మంత్రిత్వ శాఖ వాణిజ్య విభాగం అదనపు సభ్యుడు ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడారు. రైలు విద్యుదీకరణ (Track Electrification)లో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశ రైలు నెట్‌వర్క్ ఇప్పుడు 68,000 కి.మీ విస్తరించి ఉందని, మరింత విస్తరణకు సిద్ధంగా ఉందని మాథుర్ ఉద్ఘాటించారు. రైల్వే వ్యవస్థ ప్రతిరోజూ రెండు కోట్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోందని, వలస కార్మికులకు సహాయంగా ఇటీవల 5,000 ప్రత్యేక రైళ్లను నడిపిందని ఆయన గుర్తుచేశారు. భారతదేశ రైలు ఆధునికీక‌రించే య‌త్నాల్లో భాగంగా వందే భారత్ రైళ్లు ప్ర‌వేశ‌పెట్టామ‌ని ప్ర‌స్తుతం అవి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని తెలిపారు. టికెట్ వాపస్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వే విస్తరణ కోసం భారత ప్రభుత్వం రూ.85,000 కోట్లు కేటాయించి...
ఏపీ,  తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..  విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!

Andhrapradesh
Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) ప‌రిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్న‌ట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బ‌దులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా న‌డిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేప‌డుతుండ‌డంతో మరో మూడు రైళ్ల‌ను దారి మళ్లించారు.పూజ సీజ‌న్ నేప‌థ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మ‌ధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భ‌ద్ర‌తా పనుల నేప‌థ్యంలో రెండు రైళ్ల‌ను రీషెడ్యూల్ చేశారు. వి...
Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు

Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు

Telangana
Charlapalli Railway Terminal |  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి  రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ  పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.ఈ మూడు స్టేషన్లపై ఉన్న భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రైల్వే జంక్షన్ గా చర్లపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు రూ.450 కోట్లతో  టెర్మినల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇప్పటిరకు 95 శాతం పూర్తి కాగా, సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నా...
New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

New Railway Lines | మూడు కొత్త లైన్ పనుల కోసం దక్షిణ మ‌ధ్య రైల్వే క‌స‌ర‌త్తు

Telangana
New Railway Lines | తెలంగాణలో కొత్త రైల్వేపనులను ముందుకు నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. మనోహరాబాద్-కొత్తపల్లి, అక్కన్నపేట్-మెదక్, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లతో సహా తెలంగాణ ప్రభుత్వం నుంచి మూడు కీలక రైల్వే ప్రాజెక్టులకు భూమి వాటా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) కొంతకాలంగా వేచి చూస్తోంది. కొత్తపల్లి - మనోహరాబాద్ లైన్ 151.36 కి.మీ పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి ప్రాజెక్టుకు ₹2,780.78 కోట్ల అంచనా వ్యయం (భూమి ధర మినహాయించి), రాజన్న సిరిసిల్లలో దాదాపు 15.3 హెక్టార్ల అటవీ భూమికి అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. సిద్దిపేట నుంచి మరో ఐదు హెక్టార్లు, రాజన్న-సిరిసిల్లలో 42.4 హెక్టార్లు, కరీంనగర్ జిల్లాల నుంచి 38.2 హెక్టార్లు ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. రైల్వే పనుల కోసం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల నుంచి మొత్తం 1,073.7 హె...
Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Andhrapradesh
Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేష‌న్ల వివ‌రాలు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!

National
Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్ర‌త్యేక రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.తిరుపతి-అకోల (07605), అకోల-తిరుపతి (07606), పూర్ణ-తిరుపతి (07609), తిరుపతి – పూర్ణ (07610), హైదరాబాద్‌ – నర్సాపూర్‌ (07631), నర్సాపూర్‌ – హైదరాబాద్‌ (07632) తిరుపతి – సికింద్రాబాద్‌ (07481), సికింద్రాబాద్‌ – తిరుపతి (07482), కాకినాడ టౌన్‌ – లింగంపల్లి (07445), లింగంపల్లి – కాకినాడ (07446) Special Trains |ను అక్టోబర్‌ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ను పున‌రుద్ధ‌రించిన దక్షిణ మధ్య రైల్వే తెలుగు ప్రజల డిమాండ్ కు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12...
General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

General Class Coaches | రైల్వేశాఖ గుడ్ న్యూస్ .. రైళ్లలో జనరల్‌ కోచ్‌లు పెరిగాయ్‌..

National
General Class Coaches | న్యూఢిల్లీ: జ‌న‌ర‌ల్ బోగీల్లో ఒంటికాలిపై గంట‌ల కొద్దీ అవ‌స్థ‌లు ప‌డుతూ ప్ర‌యాణించే వారి కష్టాలు త్వరలో తీరనున్నాయి. పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌యాణికుల‌ను దృష్టిలో పెట్టుకొని భార‌తీయ రైల్వే రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ (అన్ రిజ‌ర్వ్ డ్‌  ) కోచ్ ల‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పై రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య నాలుగుకు పెరగనున్నాయి. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లలో విపరీతమైన రద్దీగా ఉండ‌డంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్‌ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇటీవల జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైలు కోచ్‌ల వార్షిక ఉత్పత్తి కంటే అదనంగా 2,500 జనరల్ క్లాస్ కోచ్‌లను తయారు చేయాల‌ని రైల్వే అధికారులు నిర్ణ‌యించారు. దీంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్‌ సామర్థ్యం భారీగా పెరు...

UTS Mobile App : జనరల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ టికెటింగ్‌లో కీలక అప్ డేట్..

Trending News
UTS Mobile App : దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు ఒక పెద్ద వరంలాగా, భారతీయ రైల్వేలు టికెటింగ్ విధానంలో అద్భుత‌మైన మార్పును తీసుకువచ్చింది, ముఖ్యంగా జ‌న‌ర‌ల్‌ కోచ్‌లలో ప్రయాణించే వారికి ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి 20 కిలోమీటర్ల పరిమితిని రైల్వే అధికారులు తొలగించారు. ఇది ల‌క్ష‌లాది మంది రైళ‌/ ప్రయాణీకులకు ఎంతో ఉపశమనాన్ని క‌లిగిస్తుంది. UTS యాప్ అప్‌డేట్‌తో కొత్తగా టికెటింగ్ జన‌ర‌ల్ క్లాస్ ప్రయాణీకులకు టికెటింగ్‌ను సులభతరం చేసేందుకు UTS మొబైల్ యాప్ పునరుద్ధరించారు. కీలకమైన మార్పులలో యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే దూర పరిమితిని తొలగించడం తోపాటు తద్వారా ప్రయాణీకులు తమ ఇళ్ల నుంచే జ‌న‌ర‌ల్ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెసులుబాటును క‌ల్పించింది.అయితే, ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌...