Saturday, August 30Thank you for visiting

Tag: India

Donald Trump | భారత్​ కు ట్రంప్​ షాక్​..  దేశంపై 25% సుంకాలు!

Donald Trump | భారత్​ కు ట్రంప్​ షాక్​.. దేశంపై 25% సుంకాలు!

Business, World
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి మండిపడ్డారు. భారత్‌పై 2025 ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు (20% Tariff) విధించనున్నట్లు ఆయన ఈరోజు ప్రకటించారు. అంతేకాదు, కొన్ని అంశాల్లో భారత్‌ అదనపు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పంచుకున్న పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.అమెరికా సుంకాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. ఆగస్టు 1 నుంచి భారతదేశంపై 25% సుంకం విధించ‌డంతోపాటు జరిమానా వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారతదేశం ఒకటి అని ట్రంప్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌ పోస్ట్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఆయన పోస్ట్‌లో ఇలా రాశారు- 'గుర్తుంచుకోండి, భారతదేశం మా స్నేహితుడు కానీ...
TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

Telangana
TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు.దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇటీవలే, TGSRTC ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ అంతటా ఎలక్ట్రిక్ బస్స...
2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు

2026 నాటికి భార‌త్ కు మ‌రిన్ని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు

National
డెలివరీ షెడ్యూల్ ప్రకారం, 2026 నాటికి రష్యా నుంచి S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యొక్క మిగిలిన రెజిమెంట్లను భారతదేశం అందుకోనుంది. పాకిస్తాన్, చైనాతో భారత్ పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో మొదటి మూడు యూనిట్లను విజయవంతంగా మోహరించిన తర్వాత ఇది జరుగుతుంది. భారతదేశంలోని రష్యన్ డిప్యూటీ రాయబారి రోమన్ బాబుష్కిన్ వార్తా సంస్థ PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు, ఇటీవలి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ మిగిలిన వ్యవస్థలను సకాలంలో డెలివరీ చేయాలని చెప్పారు.భారతదేశం యొక్క S-400 వ్యవస్థలు ఇప్పటికే తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి, ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌లో భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో, అవి శత్రు డ్రోన్‌లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాయి. S-400 సిస్టం కోసం ఒప్పందంపై మొదట 2018లో సంతకం చేశారు. దీని విలువ $5.43 బిలియన్లు, ఇందులో ఐదు రెజిమెంట్లు ఉంటాయి. మొదటి రెజిమెంట్ డిసెంబర్ 2021లో వచ్చి...
Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

Operation Sindoor | పీవోకే తిరిగి ఇస్తేనే చర్చలు.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు : ప్రధాని మోదీ

National, తాజా వార్తలు
India vs Pakistan LIVE Updates ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్థిరమైన వైఖరిని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ మూడు లక్ష్యాలను సాధించిందని అన్నారు. వార్తా సంస్థ ANI ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో సంభాషణ సందర్భంగా, పాకిస్తాన్ ఏదైనా చేస్తే.. దానికి మా ప్రతిస్పందన మరింత విధ్వంసకరంగా కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే రాత్రి పాకిస్తాన్ 26 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం గట్టిగా స్పందించింది.కాశ్మీర్‌పై మా వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఒకే ఒక సమస్య మిగిలి ఉందని భారత్ తెలిపింది - పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (Line of Control - POK) తిరిగి ఇవ్వడం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. వారు ఉగ్రవాదులను అప్పగించడం గురించి మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశంపై మాట్లాడే ఉద్దేశం లేదు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవ...
భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

భారత్-పాక్ కాల్పుల విరమణ | ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం : జైశంకర్

National
India-Pakistan ceasefire announced : భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ - పాకిస్తాన్ అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి ఒక అవగాహనకు వచ్చాయి. ఇది ఈరోజు ప్రకారం 17:00 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఈమేరకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (Jaishankar) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ధ్రువీకరించారు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు."భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన రాజీలేని వైఖరిని నిరంతరం కొనసాగిస్తోంది. అది అలాగే కొనసాగుతుంది" అని జైశంకర్ అన్నారు. కాల్పుల విరమణ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక అడుగును సూచిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ తన ఉగ్రవాద వ్యతిరేక విధానంలో అప్రమత్తంగా ఉందని హైలైట్ చేశారు.India Pakistan Tensions : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK), పాకిస్తాన్ (Pakistan) పంజాబ్ ప్రావిన్స్‌లోని ...
BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

BIG warning to Pak : ఇకపై ఉగ్రవాద దాడులు చేస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తాం

National
India's BIG warning to Pak : భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే దానిని "యుద్ధ చర్య"గా పరిగణించాలని, అలాగే దానికి అనుగుణంగా దీటుగా ప్రతిస్పందించాలని భారత్ నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు శనివారం తెలిపాయి.భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) మరియు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ 26 భారత స్థావరాలపై దాడి చేసినందుకు ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసిన తరువాత ఈ సమావేశం జరిగింది....
Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

Operation Sindoor 2 : మళ్లీ కాల్పులకు తెగబడుతున్ పాక్

National, Trending News
Pakistan Firing in Uri Sector : పూంచ్ సెక్టార్‌ (Punch sector)లో పాకిస్తాన్ తిరిగి భారీ షెల్లింగ్‌ను ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌ (Uri Sector) లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి చిన్న ఆయుధాలు మిసైల్స్ కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం దానికి అనుగుణంగా స్పందిస్తోంది. భారతదేశ పశ్చిమ సరిహద్దులో ఒక పెద్ద దాడిలో, పాకిస్తాన్ సైన్యం మే 7, 8న రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి వివరాలు వెల్లడించారు.మొత్తం 36 ప్రదేశాలలో 300 నుంచి 400 డ్రోన్‌లను పాక్ మోహరించిందని, వాటిలో చాలా వాటిని భారత దళాలు కూల్చేశాయని వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ డ్రోన్‌లు టర్కిష్-నిర్మిత అసిస్‌గార్డ్ సోంగర్ మోడల్‌ గా గుర్తించామని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్ ఆయుధాలను కూడా ప్రయోగించింది....
New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ కు చేదు అనుభ‌వం..

Sports
New Zealand Tour of India | సొంత‌గ‌డ్డ‌పై భార‌త్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌క‌ట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జ‌వాబు ఇవ్వ‌లేక‌పోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవ‌డంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది.12 ఏండ్లుగా ట్రోఫీని వ‌ద‌ల‌ని టీమిండియా (Team India) తొలిసారి వైట్ వాష్ కు గురైంది. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు.. రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన మ‌న బ్యాట‌ర్లు క్రీజ్ కాసేపు కూడా నిల‌వ‌లేక‌పోయారు. చివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవ‌డంతో అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోవ‌డం లేదు. ముంబైలో 25 ప‌రుగుల ఓట‌మి పాల‌యిన‌ టీ...
Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Monkey pox : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదు.. అప్రమత్తమైన కేంద్రం..

Trending News
Monkey pox : ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైరస్ యావ‌త్‌ ప్రపంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఇప్పటివరకు ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాప్తి చెందిన‌ మంకీపాక్స్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.. దిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు వెల్ల‌డించింది. మంకీపాక్స్ లక్షణాలతో అనుమానించిన కేసు.. Mpox (మంకీపాక్స్) పాజిటివ్‌గా గుర్తించిన‌ట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్న‌ట్లు నిర్ధారించిందని తెలిపింది. అయితే ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని.. అంతకు ముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదైనట్లు వివ‌రించింది. ఈ వైరస్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించింది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత...
Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

Rahul Gandhi in US | అమెరికాలో చైనాను పొగిడిన రాహుల్‌.. నిరుద్యోగ సమస్యపై వివాదాస్ప వ్యాఖ్య

World
Rahul Gandhi in US | అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యలు, తయారీ రంగంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. డల్లాస్‌లో సభికులను ఉద్దేశించి గాంధీ మాట్లాడుతూ, భారతదేశంతో సహా పాశ్చాత్య దేశాలు ఉత్పత్తి, తయారీకి ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఇది ఉద్యోగాల కల్పనకు కీలకమని ఆయన వాదించారు. అతని వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది భారతదేశ పురోగతిని బలహీనపరిచిందని మరియు చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపించింది.రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఒకప్పుడు గ్లోబల్ తయారీలో ఆధిపత్యం చెలాయించాయి. భారత్‌తో సహా అనేక దేశాలు అధిక నిరుద్యోగిత రేటుతో సతమతమవుతున్నాయని, చైనా, వియత్నాం వంటి దేశాలు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం వల్ల తమ ఉపాధి సవాళ్లను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని ఆ...