Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు
TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...