Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Hyderabad rains

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌
Andhrapradesh, Telangana

TGSRTC Discount | భారీ వ‌ర్షాల వేళ హైదరాబాద్-విజయవాడ ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌

TGSRTC Discount | హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అవ‌స్థ‌లుప‌డుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ స్వ‌ల్ప ఊర‌ట క‌ల్పించింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌ (Hyderabad to Vijayawada buses )లో రాజధాని AC సూపర్ లగ్జరీ బస్సులతో స‌హా అన్నింటిలో ప్ర‌యాణించేవారికి 10 శాతం రాయితీని అందించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్‌ఆర్‌టీసీ ) నిర్ణయించింది.హైదరాబాద్-విజయవాడ మార్గంలో ముఖ్యంగా వారాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆర్థిక భారాన్ని తగ్గించాల‌నే ఉద్దేశంతో కొన్ని హైఎండ్ సర్వీసులపై రాయితీలు (TGSRTC Discount) కల్పించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రాయితీ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మార్గంలో వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లాలనుకుంటే, విజయవాడ వరకు టిక్కెట్‌పై 10 శ...
SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..
Trending News

SCR Cancels Trains | ప్ర‌యాణికుల‌కు అలెర్ట్‌.. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లు రైళ్లు ర‌ద్దు..

SCR cancels trains | హైదరాబాద్: ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప‌లుచోట్ల రైల్వేట్రాక్స్ కొట్టుకుపోయాయి. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈ క్ర‌మంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సెప్టెంబర్ 3వ తేదీన‌ నడిచే వివిధ రైళ్లను రద్దు చేసింది.ఈమేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో.. సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233); సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234); సికింద్రాబాద్ - షాలిమార్ (12774); షాలిమార్ - సికింద్రాబాద్ (12773); సికింద్రాబాద్ - విశాఖపట్నం (22204); విశాఖపట్నం - సికింద్రాబాద్ (12805); సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707); విశాఖపట్నం - సికింద్రాబాద్ (20708) మరియు సికింద్రాబాద్ - విశాఖపట్నం (20834) రైళ్ల ను ర‌ద్దు చేశారు. షెడ్యూల్‌లో ఈ మార్పుల‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాల‌ను ప్లాన్ చేసుకోవాలని SCR అధికారులు ప్ర‌యాణికుల‌ను అభ్యర్థించారు. తిరువనంతపురం వైప...
Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్
Telangana

Red Alert | మరో రెండురోజులు దంచికొట్టనున్న వానలు.. ఏడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

Telangana Rains Red Alert  | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం న‌మోదైంది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప‌లు జిల్లాల్లో మరో రెండురోజుల పాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటూ ఈ క్రమంలో రెడ్‌ అలెర్ట్‌ను (Red Alert) జారీ చేసింది. కాగా కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో శ‌నివారం అత్యంత భారీ వర్షాలు కురిశాయి.ఇక ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అతిభారీ వర్షాలు...
IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..
Telangana

IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..

IMD Report  | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ‌ఎల్లో అలెర్ట్‌ల‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింద‌ని, వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల పాటు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేర‌నున్న‌ట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించిందిIMD Report  శుక్రవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌సిర...
TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌
Telangana

TG Rain Alert | వాయుగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

TG Rain Alert | వాయువ్య‌ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి స‌మీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్ల‌డించింది. వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌కారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్ర‌యాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా క‌దులుతూ 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది.ఈ క్రమంలో రానున్న‌ రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ను...
Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..
Telangana

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి.నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది.హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...
Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Telangana

Telangana Rains : నేడు తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana Rains: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 2న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసింది.హైదరాబాద్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38°C,  26°C నమోదయ్యే అవకాశం ఉంది.రాబోయే 7 రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు,  ఈదురు గాలులు (30-40 కి.మీ.)తో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.కాగా శనివారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి 45.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ స...
Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..
Telangana

Hyderabad Rains | భాగ్యనగర వాసులకు చల్లని కబురు.. ఉరుములు మెరుపులతో వానలు పడే చాన్స్..

Hyderabad Rains | హైదరాబాద్: ఈ వేసవిలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి.  ఉదయం 10దాటితే చాలు అడుగు బయటపెట్టాలంటే జనం  బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌ తోపాటు అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్  (Hyderabad Rains) వాసులకు కూల్ కూల్ న్యూస్ చేప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో 24గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  ఈ క్రమంలో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రానున్న 24 గంటల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపో...
గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..
Telangana

గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో ఒక్క వర్షానికే వాగులుగా మారిన రహదారులు..

Hyderabad Rains:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన టాప్  25 గానగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ లివింగ్‌ ఇండెక్స్‌ ప్రకారం హైదరాబాద్‌ వరుసగా ఐదేళ్లపాటు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపంచస్థాయి మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు  చేపడుతోంది. గ్లోబల్ సిటీగా ఎదగాలనే లక్ష్యం నిస్సందేహంగా ప్రశంసిందగినదే.. కానీ అటువంటి గొప్ప లక్ష్యాన్నిచేరుకునే ముందు ప్రజల భద్రత, కనీస ప్రాథమిక వసతులను మెరుగుచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రెండు రోజుల వర్షానికే డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పడి ప్రజలు చనిపోతున్నప్పుడు హైదరాబాద్ నిజంగా ప్రపంచ నగరంగా మారిందని ఎలా భావించగలం. ప్రతీ సంవత్సరం  వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులులన్నీ పడవ  ప్రయాణా...