Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Health cards

త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు
Telangana

త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Digital Health Cards : రాష్ట్రంలో అంద‌రికీ డిజిట‌ల్ హెల్త్ కార్డులు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)  తెలిపారు. ప్రాణాంతక క్యాన్స‎ర్‎ మహ్మమారితో ఎంతో మంది చనిపోతున్నారని.. ఈరోజు కూడా ఒక‌ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని అన్నారు. హైదరాబాద్‎ విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేసి త‌ద్వారా ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అంద‌జేస్తామ‌ని, రాష్ట్రంలోని పేదలంద‌రికీ నాణ్య‌మైన‌ వైద్యం అందుబాటులోకి తెస్తామని.. చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంద...
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి
Business

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ..మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...
Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు
Telangana

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్ట...
Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..
National, Telangana

Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..

Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న‌ రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్త‌వం లేద‌ని స్పష్టంచేశారు.ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసిన‌ట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల‌, లేదా రెండు నెలల్లో కటాఫ్‌ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ...