Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..
Crop Loan | హైదరాబాద్ : కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్ రుణమాఫీ పథకం (Rythu Runa Mafi) ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిన విషయం తెలిసిందే.. దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది.
రేషన్ కార్డు లేని రైతులకు..
అయితే రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలు (crop loan waiver) ఉన్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. ఈ విషయమై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో గత మంగళవారం కలెక్...