
బీహార్ SIR మొదటి దశ పూర్తయింది.. డ్రాఫ్ట్ జాబితా నుంచి 65 లక్షల మంది తొలగింపు
బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ రివిజన్ తొలి దశ పూర్తిచేసిన ECI7.24 కోట్ల మందితో రికార్డు స్థాయిలో బీహార్ ఓటర్ల ధృవీకరణ65 లక్షల ఓటర్ల తొలగింపు ప్రక్రియకు తెరలేపిన ECI – ముసాయిదా జాబితా ఆగస్టు 1నబీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మొదటి దశను భారత ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది.ఈ మేరకు ఈసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ ప్రక్రియలో 7.89 కోట్ల ఓటర్లలో 7.24 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు.సవరణ ప్రక్రియను చేపట్టాలనే ECI నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్న ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది. 2025 జూన్ 24 నుంచి జూలై 25 వరకు జరిగిన ఈ గణనలో మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో 7.24 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొనడం విశేషం.ECI ప్రకారం ఈ ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో అత్యంత విస్తృతమైన ఓటరు ధృవీకరణ కార్యక్రమంలో ఒకటిగా భావిస్త...