ప్రేమికుడి కోసం 2 ఏళ్ల కొడుకునే చంపేసింది..
మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయింది..
సూరత్ కు చెందిన ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి ఉండేందుకు తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టేందుకు దృశ్యం సినిమాను ఫాలో అయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఓ మహిళ నయన మాండవి.. తన రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేసింది. ఆపై తన కొడుకు కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత, ఆమె "తప్పిపోయిన" బిడ్డ కోసం పోలీసులు వరుసగా మూడు రోజులు వెతికినప్పటికీ, చిన్నారి ఆచూకీ లభించలేదు.పోలీసుల విచారణలో చిన్నారి తల్లిపై అనుమానం కలిగింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.సూరత్ లోని దిండోలి ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో నయన మాండవి కూలీగా పనిచేస్తోంది. తన రెండున్నరేళ్ల కుమారుడు వీర్ మాండవి అదృశ్యంపై ఫిర్యా...