Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!
Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే..మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేతకు అయ్యే ఖర్చును మసీదు కమిటీ సభ్యులు భరిస్తారు. ముస్లిం వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది బిఎస్ ఠాకూర్ మాట్లాడుతూ, "మసీదు పక్కన పరిమితికి మించి ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు కమిటీ సమర్పించిన సమర్పణను కోర్టు అంగీకరించింది." తమ సొంత ఖర్చులతో కూల్చివేత చేసేందుకు కమిటీ సభ్యులకు కోర్టు రెండు నెలల గడువు ఇచ...