
Rajnath Singh | పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో విలీనం అవుతుందని అన్నారు. భారత్‌లో విలీనం కావాలని పీఓకేలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారని, త్వరలో అది జరిగి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాశ్మీర్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌సింగ్‌ను ప్రశ్నించగా.. ‘వాళ్లు కాశ్మీర్‌ను ఎప్పుడైనా స్వాధీనం చేసుకోగలరా?.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆందోళన చెందల్సిన అవసరం లేదని నేను దాదాపు ఏడాదిన్నర క్రితమే చెప్పాను. ఎందుకంటే అక్కడ పీఓకే ప్రజలు భారత్‌లో విలీనాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది.ప్రభుత్వం ఏదై...