TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :
TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా ప్రయాణిల రద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు.దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ...