Kolkata rape-murder case | ఆగస్టు 17న 24 గంటల దేశవ్యాప్త వైద్యుల సమ్మె ప్రకటించిన IMA
Kolkata rape-murder case | కోల్‌కతా: కోల్‌కతాలో ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ ట్రైనీ డాక్టర్‌పై అత్యంత కిరాతకంగా అత్యాచారం, హత్య జరిగిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలికి సంఘీభావంగా, అలాగే వైద్యులపై రక్షణ కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ఈనెల 17 ఉదయం 6 గంటలకు దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెను ప్రకటించింది. కాగా ఆర్జీకర్ ఆసుపత్రిలో ఆస్తిని ధ్వంసం చేయడాన్ని కూడా ఖండించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర సేవలు కొనసాగుతుండగా, సాధారణ సేవలు పూర్తిగా నిలిపివేశారు. కాగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ట్రైనీ డాక్టర్ మరణంపై దర్యాప్తు కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే..వైద్యుల సమ్మెలో భాగంగా, ఔట్ పేషెంట్ విభాగాలు మూసివేశారు. షెడ్యూల్ చేయబడిన అన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేశారు. "కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జరిగిన క...