Saturday, September 13Thank you for visiting

Tag: Congress Govt

Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత

Aasara Pensions | తెలంగాణ‌లో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత

Telangana
Aasara Pensions |  ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్ర‌మాల‌ను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌ హయాంలో పెన్ష‌న్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల‌ కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నార‌ని వెల్లడించింది.నివేదిక‌ల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వారి నెలవారీ పెన్షన్‌లతో పాటు ఆసరా పెన్ష‌న్లు (Aasara Pensions)  కూడా పొందుతున్నారు. వీరిలో 3,824 మంది మరణించగా, మిగిలిన 1,826 మంది రెండు ర‌కాల పెన్షన్లు తీసుకుంటున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వం జూన్ నుంచి వీరికి ఆసరా పింఛన్లను నిలిపివేసింది.ఒక్క ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనే 427 మంది అక్రమంగా డబుల...
Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Rythu Runa Mafi | రుణ‌మాఫీకి ఆ కార్డు అవ‌స‌రం లేదు.. బంగారం తాకట్టు రుణాలకు వర్తించదు..

Telangana
Rythu Runa Mafi | గ‌త ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమ‌లు చేసి తీరుతామ‌ని సీఎం రేవంత్ ‌రెడ్డి (CM Revanth Reddy) మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్ర‌క్రియను ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్ర‌వారం సీఎం రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామ‌ని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్‌ ‌కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమ‌ని తేల్చి చెప్పారు. కేవ‌లం ప‌ట్టా పాస్‌ ‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై ఆస‌క్తిక‌...
ORR Hyderabad |  ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో  ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

Telangana
ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...
Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Modernization of ITI’s | విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఐటీఐల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.2,324.21 కోట్లు..

Telangana
Modernization of ITI's | హైదరాబాద్‌: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ‌ను నైపుణ్యం కలిగిన యువశక్తికి కేంద్రంగా మార్చాల‌ని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ల అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.మంగళవారం మధ్యాహ్నం మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతకు ఏటీసీల్లో శిక్షణ ఇవ్వ‌నున్నారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన పరికరాలు, సాంకేతికతను అందుబాటులోకి తీసుక...
CM Revanth Reddy | సర్కారు బడులపై  ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

CM Revanth Reddy | సర్కారు బడులపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం..

Telangana
CM Revanth Reddy  | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామ‌న్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేద‌ని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు.ప‌దో త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు వందేమాత‌రం ఫౌండేష‌న్ (vandemataram foundation) ఆధ్వ‌ర్యంలో  రవీంద్రభారతిలో సోమ‌వారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ...
New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Telangana
ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి ...
Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

Telangana
Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష...
Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Telangana
New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది.మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...
CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : త్వరలోనే రూ.500లకు గ్యాస్ సిలిండర్.. ఇంద్రవెల్లి సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే మొదటి బ‌హిరంగ స‌భ‌ను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంత‌కు ముందు అక్కడ ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే రూ.500ల‌కు గ్యాస్ సిలిం...