నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శలు – PM Modi
PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు చేసి, సర్దార్ పటేల్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఆ తర్వాత భారతదేశ ఐక్యత, క్రమశిక్షణ, సాంస్కృతిక వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ ఏక్తా దివస్ సమరోహ్ జరిగింది.X లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, భారత దేశ సమగ్రత వెనుక ఉన్న శక్తి సర్దార్ పటేల్ అని ప్రధాని మోదీ అన్నారు. "సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. భారతదేశ...










