
‘చనిపోయిన’వారికి రూ. 2 కోట్ల విలువైన పెన్షన్లు ఇచ్చేశారు.. అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..
ప్రభుత్వ పథకం దుర్వినియోగంపై కాగ్ ధ్వజం
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 'చనిపోయిన' లబ్ధిదారులకు కూడా పెన్షన్ల చెల్లించినట్లు కాంగ్ గుర్తించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (National Social Assistance Programme -NSAP) అమలులో అనేక అవకతవకలను గుర్తించింది. బీపీఎల్ కింద పేదరికంలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లను అందించడానికి కేంద్రం అందిస్తున్న పథకం. ఒక నివేదిక ప్రకారం 2017 నుండి 2021 వరకు 26 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దాదాపు 2,103 మంది లబ్ధిదారులకు వారి మరణానంతరం కూడా రూ. 2 కోట్ల పెన్షన్లు చెల్లించాయి
NSAP మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారుల మరణం, వలసలు లేదా వారు BPL బెంచ్‌మార్క్‌ను దాటిన తర్వాత పెన్షన్ (pensions) చెల్లింపు ఆగిపోతుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు మరణాలను సకాలంలో అప్డేట్ చేయడంలో విఫలమయ్యాయని. ఇది జీవించి ల...