AP, TG CM’s Meeting | ఇద్దరు సీఎం ల సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే..
AP, TG CM's Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైదరాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబుకు సిఎం రేవంత్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు.విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై ఇద్దరు సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రజాభవన్‌లో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివరించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు స...