సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటనడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో
కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య
చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి
కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్‌మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది...