
IPL 2024 : ఐపీఎల్ ఫీవర్.. చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లు
CSK Vs RCB IPL 2024 Match 1 | చెన్నైలోని చెపాక్‌లోని MA చిదంబరం స్టేడియంలో 2024 టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌ల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ ఐపిఎల్ 2024 సీజన్‌ను మార్చి 22న MA చిదంబరం స్టేడియంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సిద్ధంగా ఉంది .ఈ మ్యాచ్ లను తిలకించేందుకు ప్యాసింజర్ స్పెషల్స్ రైలు 2024 మార్చి 22, 26వ తేదీల్లో వేలచ్చేరి-చింతాద్రిపేట్-వేలాచ్చేరి మధ్య నడుస్తుంది. రైల్వే ప్రకారం, మొత్తం నాలుగు రైళ్లలో నడుస్తాయి. రెండు వేలాచ్చేరి నుండి, మిగిలిన రెండు చింతాద్రిపేట నుండి నడవనున్నాయి.
చెన్నై మెట్రో సమయాల పొడిగింపు
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) IPL 2024 క్రికెట్ మ్యాచ్ కారణంగా మెట్రో రైళ్ల సమయాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. CMRCL ప్రయాణాన్ని సులభతరం చేయడాన...