Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Centre lifts ban on government officials joining RSS

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం
National

RSS | ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్ఎస్ఎస్ సోమవారం (జూలై 22) స్వాగతించింది. కేంద్రం చర్యపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార సారథి సునీల్ అంబేకర్ స్పందిస్తూ.. ‘గత 99 ఏళ్లుగా దేశ పునర్నిర్మాణంలోనూ, సమాజ సేవలోనూ ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం నిమగ్నమై ఉంది. దేశ భద్రతలో సంఘ్ సహకారం కారణంగా, ఐక్యత-సమగ్రత, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాజంతో మమేకమై సేవలందించడం చేశాయని తెలిపారు."తన రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, అప్పటి ప్రభుత్వం సంఘ్ (RSS) వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరాధారంగా నిషేధించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కాగా "నవంబర్ 7, 1966న, పార్లమెంటు వద్ద...