Tuesday, April 8Welcome to Vandebhaarath

Tag: Budget 2024

AP Budget 2024 | ఏపీ బడ్జెట్..  శాఖల వారీగా కేటాయింపులు ఇవి :
Andhrapradesh

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...
MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!
Business

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం - ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల ...
Hyderabad Metro |   రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు
Telangana

Hyderabad Metro | రాష్ట్ర బ‌డ్జెట్ లో మెట్రో రైలు విస్తరణకు భారీగా నిధులు

Hyderabad Metro | హైద‌రాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉంద‌ని భట్టి విక్రమార్క వెల్ల‌డించారు. కాగా, 2024 - 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించిన‌ట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్‌ సిస్టమ్...
Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేద‌ల‌కు శుభ‌వార్త‌.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం..
Telangana

Indiramma Housing Scheme | ఇండ్లు లేని పేద‌ల‌కు శుభ‌వార్త‌.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం..

Telangana Budget |  తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే త‌మ‌ ప్రభుత్వ కర్తవ్యమని బ‌డ్జెట్ స‌మావేశంలో ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల‌ పేరుతో పేదల‌ను ముంచింద‌ని విమ‌ర్శించారు. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించలేద‌ని ఆరోపించారు. అయితే పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల గృహాల నిర్మించాల‌ని ప్రభుత్వం లక్ష్యంగ...
Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..
National

Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..

Union Budget 2024 | కేంద్ర‌ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్ల‌డించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్ర‌యాణికుల‌కు భద్ర‌త‌, సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్ల‌డిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ గురించి కూడా వివ‌రాల‌ను పంచుకున్నారు. రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే...
Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు
Business

Railway Budget 2024 | రైల్వేల భ‌ద్ర‌త‌కు భారీగా కేటాయింపులు.. సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయాలు

Railway Budget 2024 | రైలు భద్రతను పెంపొందించడానికి, “కవాచ్” ఆటోమేటిక్ రైలు-రక్షణ వ్యవస్థను అమ‌లు చేయడానికి భారతీయ రైల్వే తన బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించ‌నుంద‌ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మొత్తం రూ.2,62,200 కోట్ల రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.1,08,795 కోట్లను పూర్తిగా రైల్వే భద్రతా చ‌ర్య‌ల‌కు కేటాయించినట్లు వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో పాత ట్రాక్‌ల భర్తీ, సిగ్నలింగ్ సిస్టమ్ మెరుగుదల, కవాచ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటివి ఉన్నాయి.“ఈ కేటాయింపులో పెద్ద భాగం - రూ. 1,08,795 కోట్లు - పాత ట్రాక్‌లను కొత్త వాటితో భర్తీ చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలో మెరుగుదల, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వంటి భద్రతా సంబంధిత కార్యకలాపాలకు కేటాయించ‌నున్న‌ట్లు చెప్పారు. రైల్వే బడ్జెట్ కవాచ్‌కు ప్రాధాన్యం కవాచ్‌కు ఇచ్చి...
Budget 2024 – Andhrapradesh :  కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు
Andhrapradesh, Business

Budget 2024 – Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

Budget 2024 - Andhrapradesh | బడ్జెట్​ 2024లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చుచేస్తామని హామీనిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ పూర్తిచేయ‌డానికి కూడా సాయమందిస్తామ‌ని తెలిపారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పారు.. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు అందిస్తామ‌ని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామ‌ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామ‌ని చెప్పారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కు రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా నిధులు మంజూరు చేయాల‌ని కేంద్రం నిర్ణయించిందని...
Budget 2024 |  కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు
Business

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..
National

Budget 2024: అంగన్ వాడీ, ఆశాకార్యకర్తలకు గుడ్ న్యూస్.. మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు..

Budget 2024 Highlights: ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman). ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ..   ఆయుష్మాన్ భారత్ పథకంలో (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) వీరిని అర్హులుగా ప‌రిగ‌ణిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే... ఇందుకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతోన్న‌ది వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ ప‌థ‌కానికి రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్‌ పథకం కింద అర్హుల‌కు రూ.5 లక్షల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందిస్తారు. అలాగే ఈ కార్డ్ ద్వారా అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశాకార్య‌క‌ర్త‌లు వైద్యం చేయించుకునేందుకు వెసులుబాటు ఉంది. పైగా ఇది న‌గ‌దు ర‌హిత సేవ‌. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతో...