
Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!
Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల వేగాన్ని పెంచడంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేరకు లోక్‌సభ 2024 మేనిఫెస్టోలో మల్టీ హై-స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు కారిడార్‌లపై హామీని పొందుపరిచే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో కీలక వాగ్దానంగా అనేక హెచ్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లను చేర్చడాన్ని పార్టీ పరిశీలిస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
హై-స్పీడ్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త వెర్షన్ రైళ్ల కనెక్టివిటీని పెంచడంపై రాబోయే ఐదేళ్లలో పార్టీ ప్రధానంగా దృష్టిసారిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు ఆంగ్ల మీడియాకు చెప్పారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాషాయ పార్టీ ఇంకా మేనిఫెస్టోను విడుదల చేయలేదు.ఈ ఏడాది మార్చిలో వచ్చిన మధ్యంతర బడ్జెట్‌లోనూ రైల్వే రంగం దృష్టి సారించింది. పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, ఎనర్జీ...