Friday, January 23Thank you for visiting

Tag: bjp

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Elections
Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బ‌ద్ద‌లుక కొట్టేలా క‌నిపించింది.రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని కూటమి కేవలం 28 సీట్లకే పరిమితమైంది.2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రెండు దశల్లో పోలింగ్ జ‌రిగింది. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 65.08 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు...
నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

నెహ్రూ వల్లే ఆ సమస్య.. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పై ప్ర‌ధాని మోదీ విమర్శలు – PM Modi

National
PM Modi Criticizes Congress Article-370 | గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద భార‌త తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివాస్‌) సందర్భంగా జరిగిన జాతీయ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రధానమంత్రి ఉదయం స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకుని, ప్రార్థనలు చేసి, సర్దార్ పటేల్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఆ తర్వాత భారతదేశ ఐక్యత, క్రమశిక్షణ, సాంస్కృతిక వైవిధ్యాన్ని హైలైట్ చేస్తూ ఏక్తా దివస్ సమరోహ్ జరిగింది.X లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ, భారత దేశ సమగ్రత వెనుక ఉన్న శక్తి సర్దార్ పటేల్ అని ప్రధాని మోదీ అన్నారు. "సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది. భారతదేశ...
25 ప్రధాన తీర్మానాలతో ఎన్‌డీఏ మేనిఫెస్టో విడుద‌ల ‌‌ – Bihar NDA Manifesto 2025

25 ప్రధాన తీర్మానాలతో ఎన్‌డీఏ మేనిఫెస్టో విడుద‌ల ‌‌ – Bihar NDA Manifesto 2025

National
Bihar NDA Manifesto 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఈరోజు తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ "సంకల్ప్ పాత్ర"ను పాట్నాలోని హోటల్ మౌర్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో విడుదల చేశారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కూటమి భాగస్వాములు చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో ప్రధానంగా ఉద్యోగ కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది.ఇది సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు అనేక హామీలు ఇచ్చింది. రైతులకు నెలవారీ ₹3,000 చెల్లింపులు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వే లు, ఉచిత విద్యుత్, వైద్య చికిత్స, శాశ్వత ఇళ్ళు, కర్పూరి ఠాకూర్ సమ్మాన్ నిధి త‌దిత‌ర హామీలు NDA మెనిఫెస్టోలో పొందుప‌రిచారు.25 ప్రధాన అంశాలపై ఎన్డీఏ ప్రజల్లోకిఈ మేనిఫెస్టో బీహార్ రాష్ట్రానికి దిశానిర్దేశం...
2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date

2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date

Elections
Bihar Election 2025 Date : బీహార్‌లో ఎన్నికల న‌గారా మోగింది. ఈరోజు భారత ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్ అసెంబ్లీలో EVMలలో అభ్యర్థుల క‌ల‌ర్ ఫొటోలు ప్ర‌చురించ‌డం ఇదే మొదటిసారి. గతంలో, ఇవి నలుపు మరియు తెలుపు రంగులో ఉండేవి.బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలు ప్రకటించారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ గురువారం, నవంబర్ 6, 2025న, రెండవ దశ మంగళవారం, నవంబర్ 11, 2025న జరుగుతుంది. మొదటి దశలో మొత్తం 121 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, రెండవ దశ మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు జరుగుతుంది. ఫలితాలు ఆదివారం, నవంబర్ 14న ప్రకటిం...
బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :

బిజెపి, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదం లేదు :

National
ఇవి రెండూ ఒకే సైద్ధాంటిక కుటుంబానికి చెందివి : రామ్ మాధవ్RSS రాజకీయాలకు అతీతం – BJP రాజకీయ దృక్కోణం నుంచి పనిచేస్తుంది: రామ్ మాధవ్ప్రధాని మోదీ ప్రసంగానికి RSS ప్రశంసలుRSS : భారతీయ జనతా పార్టీ (BJP ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒకే సైద్ధాంతిక కుటుంబంలో భాగమని, రెండింటి మధ్య ఎటువంటి భేదాభిప్రయాలు లేవని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ (Ram Madhav) స్పష్టంగా పేర్కొన్నారు. రెండు సంస్థలు రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో పనిచేస్తాయని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల చరిత్రను గుర్తించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రశంసించారు.రెండు సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం ఉందని ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు RSS నాయకుడు రామ్ మాధవ్ అలాంటి ఊహాగానాలను తోసిపుచ్చారు. రెండు సంస్థలు సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్న...
Telangana | ఉడ్తా తెలంగాణ కావొద్దు..

Telangana | ఉడ్తా తెలంగాణ కావొద్దు..

Telangana
Telangana News | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం విస్తరిస్తోంద‌ని, యువత, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంద‌ని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతోంద‌ని విమర్శించారు.. వ‌నపర్తి (Vanaparthi)లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంచంద‌ర్ రావు మాట్లాడారు. వనపర్తి జిల్లాతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉంద‌ని కానీ ప్రజల కష్టాలను పట్టించుకోవ‌డంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని విమ‌ర్శించారు.ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల తమ భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదు. ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారిక...
Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం  ..

Sadanandan Master | దుండ‌గుల చేతిలో రెండు కాళ్లు కోల్పోయిన జాతీయవాదికి పట్టం ..

National, Trending News
సదానందన్ మాస్టర్‌కు భారతీయ జనతా పార్టీ గౌరవంరాజకీయాల్లో పదవులు సాధించడం సాధారణమే అయినా… రెండుకాళ్లు కోల్పోయిన తర్వాత కూడా ధర్మ మార్గాన్ని ప్రజాసేవను విడిచిపెట్టకుండా జాతీయవాదం కోసం ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తిరిగి పునర్మించుకున్న ఒక వ్యక్తి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) ..కేరళలో కమ్యూనిస్టుల చేతుల్లో పాశవిక దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయినా… ఆ బాధను స్ఫూర్తిగా మార్చుకుని దేశభక్తి మార్గాన్ని వదలకుండా ముందుకు సాగిన ఓ సాధారణ ఉపాధ్యాయుడు సి సదానందన్ మాస్టర్ (Sadanandan Master) . ఆయన జీవిత యాత్ర ఇప్పుడు మరో మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఆయనను ఎంపిక చేసింది. ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తిగత గౌరవం కాదు… దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల హింసకు బలి అయిన లక్షలాది దేశభక్తుల త్యాగాలకు గుర్తింపు కల్పించే ఘట్టమని చెప్పవచ్చు. . . రాజ్యసభకు సి సదానందన్ మాస్టర్ నామిన...
Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

Telangana
కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పిలుపుTiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో మ‌న వీర‌జ‌వాన్ల‌కు మద్దతు తెలుపుతూ శ‌నివారం ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర్వ‌హించే తిరంగా యాత్ర‌ (Tiranga Yatra )ను విజ‌య‌వంతం చేయాల‌ని   బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్ర‌వారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు  కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశార‌ని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప...
Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Elections
Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి (Palani swami) నాయకత్వంలో పోటీ చేస్తారని అన్నారు. బిజెపి, ఎఐఎడిఎంకెల మధ్య పొత్తుకు ఎటువంటి షరతులు విధించలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎంకె స్టాలిన్ డిఎంకెను ఓడించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK), భారతీయ జనతా పార్టీ (...
Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

National
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో కూడిన లోక్‌సభ బిజినెస్ అడ్వయిజరీ (BAC) ఎనిమిది గంటల చర్చకు అంగీకరించిందని, సభలో అప్పటి పరిస్థితిని బట్టి దీనిని పొడిగించవచ్చని అన్నారు.ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్, అనేక ఇతర ఇండియా బ్లాక్ సభ్యులు వాకౌట్ చేయడంతో, బిల్లుపై ట్రెజరీ, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరగనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయ ఉద్రిక్తతలు, చర...