
Nitish Kumar | బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన సీఎం నితీశ్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పటికీ 130 మంది శాసనసభ్యులు ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. కాగా బీహార్ అసెంబ్లీలో 243 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.JD(U), RJD, కాంగ్రెస్ ఫ్రంట్ అయిన మహాఘటబంధన్ (మహాకూటమి) నుండి నితిష్ కుమార్ BJP నేతృత్వంలోని NDA కూటమిలోకి చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం అవిశ్వాస పరీక్షలో నితిష్ గెలిచారు. ఈ సెషన్‌లో ముగ్గురు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతన్ ఆనంద్ ఎన్డీఏలోకి మారారు.అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను తీసుకొచ్చిన కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, 15 ఏళ్లుగా లాలూ ప్రసాద్, రబ్రీ దేవి ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు.2005లో తాను అధికారంలోకి వచ్చినప్...