UPI Payments | ఇకపై ఫింగర్ ప్రింట్ ఫేస్ రికగ్నేషన్ తో UPI చెల్లింపులు ?
UPI Payments | భారత్ లో అత్యధిక డిజిటల్ లావాదేవీలు UPI ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం, UPI ద్వారా చేసిన చెల్లింపుల గణంకాలు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయినప్పటికీ, UPI చెల్లింపులను ఉపయోగించని వారు దేశంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), UPI చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేయాలని ప్లాన్ చేస్తోంది. UPI చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఇకపై పిన్ కోడ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వారు ఫేస్ రికగ్నేషన్ (Facial Recognition), లేదా ఫింగర్ ప్రింట్ ను ఉపయోగించవచ్చు.
బయోమెట్రిక్ సాయంతో.. UPI Payments
స్మార్ట్‌ఫోన్ బయోమెట్రిక్‌ల సాయంతో UPI చెల్లింపులకు సంబంధించి NPCI పలు కంపెనీలతో చర్చలు జరుపుతోందని ఇటీవలి నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో, వినియోగదారులు ఏదైనా UPI పే...