Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Bhadhrachalam to Odisha line line

Railway Line | తెలంగాణలో  రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే సేవలు
Telangana

Railway Line | తెలంగాణలో రూ.3592 కోట్లతో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాలకు కొత్తగా రైల్వే సేవలు

Railway Line | రాష్ట్ర ప్రజలకు శుభవార్త...  తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒరిస్సాకు మధ్య రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు  కొత్త రైల్వే లైన్ నిర్మాణం దిశగా మార్గం సుగమమం అయింది.  ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, సుక్మా ప్రాంతాల మీదుగా ఒడిశాలోని మల్కాన్‌గిరి వరకు 186 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం జరగనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.3592 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లనున్న మొదటిసారి రైల్వే లైన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు కొత్తగా రైల్వే సేవలు అందబాటులోకి వస్తాయి.  ఆయా ప్రాంతాలు కూడా త్వరితగతిన ప్రగతిబాట పట్టనున్నాయి. అయితే తెలంగాణ-ఒరిస్సా రైల్వే లైన్ నిర్మాణానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి రైల్వే శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది...