ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ?.. వీడియో వైరల్..
Bengaluru traffic jam | కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో ఎన్నడూ ఊహించని విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వాహనాల ట్రాఫిక్‌తో మహానగరాల్లో రోడ్లన్నీ కిక్కిరిసిపోయిన గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ట్రాఫిక్ చిక్కులతో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల్లో బెంగళూరు సిటీది దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ మన గమ్యస్థానాలకు చేరుకోవడానికి గంటల పాటు సమయం పడుతుంది. అయితే తాజాగా నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై నడిచే రైళ్లు కూడా బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకోలేదు.ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుపోయేవి. కానీ ఇప్పుడు ఆ లిస్టులో ట్రైయిన్ కూడా వచ్చి చేరింది. బెంగళూరు నగరంలో ఒక రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద పలు వాహనాలు ముందు కదులుతుండగా.. కొద్ది దూరంలో ఓ రైలు...