Bengal Hooghly Rape Case | పశ్చిమ బెంగాల్ లో మరో ఘోరం..
Bengal Hooghly Rape Case | కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో గత నెలలో జరిగిన క్రూరమైన అత్యాచారం హత్య కేసుకు సంబంధించి ఇంకా ఆగ్రహావేశాలు, నిరసన జ్వాలలు చల్లారకముందే.. మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం రాత్రి 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా "లైంగిక వేధింపులకు" గురైంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, హుగ్లీ జిల్లాలోని హరిపాల్ ప్రాంతంలో రోడ్డు పక్కన పాక్షికంగా నగ్న స్థితిలో బాలిక అపస్మారక స్థితిలో కనిపించడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది.నివేదిక ప్రకారం, శుక్రవారం రాత్రి 15 ఏళ్ల బాలిక ట్యూషన్ తరగతులకు హాజరైన తర్వాత ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కొందరు దుండగులు బాలికపై లైంగిక వేధింపులకు గురిచేసి బట్టలు చిరిగిపోయి అపస్మారక స్థితిలో రోడ్డుపై పడవేశారు. బాలికను ఆసుపత్రిలో చేర్చారని, అక్కడ ఆమెకు వైద...