Bhatti Vikramarka | రైతు రుణ మాఫీ అమలుపై బ్యాంకర్లకు డిప్యూటి సిఎం భట్టి కీలక సూచనలు
Telangana | రైతు రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక (Bhatti Vikramarka) వ్యాఖ్యలు చేశారు. రుణాల మాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని అన్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం ఇప్పటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగం రాష్టాన్రికి వెన్నెముకగా భావిస్తున్నదని తెలిపారు. వ్యవసాయానికి మద్దతిచ్చేందుకు రుణమాఫీ (Rythu Runamafi ), రైతు భరోసా, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
రూ.36వేల కోట్ల విలువైన ఎంఓయూలు
ఉచితంగా 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, రెండు లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని చెప్పారు. ఇవి వ్యవసాయం అన...