
Ayodhya railway station | ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య స్టేషన్ ఎలా ముస్తాబైందో చూడండి..
Ayodhya : రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అయోధ్యలోని రైల్వేస్టేషన్ (Ayodhya railway station) అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలు, కొత్త సైన్ బోర్డులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, గోడలపై చిత్రీకరించిన రాముడి చిత్రాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
జనవరి 22న జరగనున్న రామాలయ మహా ప్రతిష్ఠాపనకు ముందు ఆలయ పట్టణానికి తరలివస్తున్న పర్యాటకులు రైల్వే స్టేషన్ లో.. సరికొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
వచ్చే నెల సంప్రోక్షణ మహోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ డిసెంబర్ 30న ఆలయ పట్టణాన్ని సందర్శించనున్నారు.
దిల్లీకి చెందిన పర్యాటకుడు పురుషోత్తం మాట్లాడుతూ.. కొత్తగా ఆధునికీకరించిన రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, సందర్శకుల కోసం...